Begin typing your search above and press return to search.
రాజా పూర్తి చేస్తాడని గుణ ఎదురుచూపులు
By: Tupaki Desk | 12 April 2015 3:30 AM GMTబండెనక బండి కట్టి .. అన్న చందంగా ఒకదాని వెంట ఒకటిగా భారీ సినిమాలు రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకి వేరే సినిమా ఏదీ పోటీ బరిలో లేదు. దాంతో యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లలో ఫర్వాలేదనిపిస్తోంది. అయితే ఈ హడావుడి అంతా బాలయ్యబాబు 'లయన్' వచ్చేవరకూ సాగుతుంది. ఆ సినిమా వచ్చాక సత్యమూర్తి హడావుడి తగ్గే ఛాన్సుంది.
ఆ తర్వాత ఇంకే పెద్ద సినిమా ఉంది? అని ఆలోచిస్తే రెండు భారీ ప్రాజెక్టులు క్యూలో కనిపిస్తున్నాయి. మే, జూన్‌లో ఇవి రెండూ రిలీజయ్యే అవకాశాలున్నాయి. భారీ కాన్వాసుతో తెరకెక్కుతున్న 'బాహుబలి', 'రుద్రమదేవి 3డి' ఒకదాని వెంట ఒకటిగా దోబూచులాడుకుంటున్నాయి. ఈ రెండిటికి సంబంధించి కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. రుద్రమదేవి 3డి రీరికార్డింగ్ కోసం ఇళయరాజా లండన్ వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. బాహుబలి విజువల్ ఎఫెక్ట్స్ కోసం రాజమౌళి సియోల్ వెళ్లి సందడి చేస్తున్నాడు. ఇలా ఎవరికి వారు బిజీలో ఉన్నారు.
ఒకసారి ఫైనల్ ప్రొడక్టును కళ్ల చూడడమే ఆలస్యం. బిజినెస్‌లో స్పీడ్ పెరుగుతుంది. గుణశేఖరుని ఎదురు చూపులు కూడా ఆ క్షణం కోసమే. ఇలా పని పూర్తయింది అనగానే ఇక అన్ని ఏరియాల నుంచి బిజినెస్ కాల్స్ వస్తాయి. అసలే అవసరాన్ని మించి పెట్టుబడులు కుమ్మరించారు. సెట్‌ల కోసమే భారీగా ఖర్చు చేశారు. కాబట్టి రుద్రమదేవి 3డికి రికవరీ చాలా ముఖ్యం.
నైజాం వరకూ దిల్‌రాజు ఆదుకుంటున్నాడు. మిగతా ఏరియాల వ్యాపారం పూర్తవ్వాల్సి ఉందట. అదంతా పోస్ట్ ప్రొడక్షన్‌లో క్లారిటీ, రిలీజ్ తేదీలో క్లారిటీని బట్టే ఉంటుంది. ఆ తర్వాత రిలీజ్ విషయంలో బాహుబలితో పోటీ లేకుండా చూసుకోవడం కీలకం. నెల రోజుల గ్యాప్ తప్పనిసరి. అదన్నమాట!