Begin typing your search above and press return to search.
రాక్ స్టార్ అనిరుధ్ మెలోడి 'గుండెలోనాకు'
By: Tupaki Desk | 11 Oct 2022 3:06 PM GMTవిక్టరీ వెంకటేష్ - విశ్వక్ సేన్ అరుదైన కలయికలో తెరకెక్కుతున్న సినిమా `ఓరి దేవుడా`. అశ్వత్.ఎం దర్శకుడు. పీవీపీ నిర్మాత. ఇటీవల విడుదలైన పాటలు ట్రైలర్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అదే జోరును కొనసాగిస్తూ ఈరోజు మేకర్స్ మూడో సింగిల్ `గుండెలోనా` పాటను విడుదల చేశారు. కొత్తగా విడుదలైన ఈ పాట శ్రావ్యమైన ట్యూన్ కుదరగా.. అనిరుధ్ రవిచందర్ గాత్రదానం చేసారు. లియోన్ జేమ్స్ అద్భుతమైన బీట్ అందించారు.
రెండు రోజుల క్రితం విడుదలైన `పదం నుండి పాట విజేత...` శ్రోతలను వెంటనే కట్టిపడేసే సాహిత్యంతో ఆకట్టుకుంది. సాహిత్యం చక్కని సంగీతం కలయికతో `గుండెలోనా` చార్ట్ బస్టర్ గా నిలిచింది. అందమైన కలలు కనే జంట విశ్వక్ సేన్ - ఆశా భట్ పై మెలోడియస్ గీతానికి తగ్గట్టుగా అద్భుత కొరియోగ్రఫీ అలరించింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతోంది.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంతో మిథిలా పాల్కర్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది. విజయ్ ఎడిటర్ కాగా... విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పివిపి సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.