Begin typing your search above and press return to search.
తెరపైకి శ్రీవిధ్య.. ‘గుంజన్ సక్సేనా’ కొత్త వివాదం
By: Tupaki Desk | 19 Aug 2020 3:30 AM GMTశ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ‘గుంజన్ సక్సేనా’ ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాలో ఆర్మీకి వ్యతిరేకంగా కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో చూపించిన విషయాలు నిజాలు కావు అంటూ ఆర్మీ అధికారులు ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా అంటూ వచ్చిన ఈ సినిమాలో గుంజన్ సక్సేనా గురించి చూపించారు. ఇండియాలో మొదటి ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా అంటూ ఆ సినిమాలో చెప్పడం జరిగింది. కాని అది నిజం కాదంటూ శ్రీవిధ్య రాజన్ తెరపైకి వచ్చారు.
మొదటి నుండి కూడా స్టార్ వారసులను వ్యతిరేకిస్తూ వస్తున్న కంగనా రనౌత్ ఈ సినిమా ఎప్పుడు దొరుకుతుందా అంటూ ఎదురు చూస్తుంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించడం వల్ల కంగనా ఈ సినిమాపై విమర్శలు చేస్తూనే వచ్చింది. ఇటీవల శ్రీవిద్య రాజన్ మీడియా ముందుకు వచ్చి తాను గుంజన్ బ్యాచ్‌మెంట్ అని, మొదట నేను ఎయిర్ ఫోర్స్‌ను కార్గిల్‌లో నడిపానంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని రీట్వీట్ చేసిన కంగనా గుంజన్ సక్సేనా చిత్రంలో నిజాలు చెప్పలేదంటూ విమర్శలు చేసింది.
ట్విట్టర్‌లో కంగనా... నేను కేంద్ర ప్రభుత్వంకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటీ అంటే కరణ్ జోహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెంటనే వెనక్కు తీసుకోవాలి. ఆయన నన్ను బెదిరించాడు. నేను సినిమాల్లో నటించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేశాడు. అలాగే సుశాంత్ కెరీర్‌ను కూడా ఆయన నాశనం చేశాడు అంటూ కంగనా రనౌత్ పేర్కొంది. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు పొందే అర్హత లేదు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. కంగనా ట్వీట్ తో గుంజన్ సక్సేనా గురించి సినిమాలో చూపించింది అంతా కూడా డ్రామానేనా అంటూ నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.