Begin typing your search above and press return to search.
'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' ట్రైలర్ విడుదల...!
By: Tupaki Desk | 1 Aug 2020 8:30 AM GMTబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ యుద్ధ ఫైలట్ గా నటిస్తున్న చిత్రం ''గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్''. భారత దేశపు తొలి మహిళా ఐఏఎఫ్ పైలట్.. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లేడీ పైలెట్ గా 'కార్గిల్ గర్ల్'గా ఖ్యాతికెక్కిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోపిక్ ని ఆగష్టు 12న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ప్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' ట్రైలర్ విడుదల చేశారు.
కాగా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకిత్తించే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. ''నువ్వు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలంటే సోల్జర్ గా మారాలి.. లేకపోతే తిరిగి వంటగదికి వెళ్లిపోండి'' అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ''మా డ్యూటీ దేశాన్ని కాపాడటం.. నీకు ఈక్వల్ ఆపర్చ్యునిటీ ఇవ్వడం కాదు'' అని చెప్తూ సైనికులకు జెండర్ ని బట్టి అవకాశాలు ఉండవని చెప్తున్నారు. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసిన ఓ బాలిక నేను పైలట్ అవుతాను అని సోదరుడికి చెప్పగా 'అమ్మాయిలు పైలట్ అవలేరు' అని చెప్తాడు. ''నువ్వు ఆర్మీ లో జాయిన్ అయినప్పుడు.. నేను ఎందుకు ఫైలట్ అవ్వకూడదు'' అని ప్రశ్నిస్తుంది. మరోవైపు తన తండ్రి విమానం నడపడానికి అమ్మాయా అబ్బాయా అనేది మ్యాటర్ కాదు.. ఎందుకంటే వాళిద్దరిని కూడా 'పైలట్' అనే పిలుస్తారు అని చెప్పుకొస్తాడు. లేడీ ఫైలట్ కి టాయిలెట్స్ లేకపోవడం.. అబ్బాయిలతో ధీటుగా ఎనర్జీ మైంటైన్ చేయాలని కించపరచడం లాంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. మొత్తం మీద గుంజన్ సక్సేనా ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.. జాయిన్ అయ్యాక ఎలాంటి ప్రొబ్లెమ్స్ చూడాల్సి వచ్చింది.. అన్నిటిని దాటుకొని కార్గిల్ యుద్ధంలో ఎలా పోరాడింది అని ఈ సినిమాలో చెప్పబోతున్నారు.
జాన్వీతో పాటు ఈ సినిమాలో అంగద్ బేడీ - మానవ్ విజ్ - పంకజ్ త్రిపాఠి - రజత్ బర్మేచా - నీనా గుప్తా - విజయ్ వర్మలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి ఆమె తండ్రిగా అంగద్ బేడీ సోదరుడిగా కనిపించారు. ఇక ఈ చిత్రానికి అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నిజానికి 'గుంజన్ సక్సేనా' చిత్రాన్ని మార్చి 13, 2020న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం థియేటర్లకు అనుమతి ఇవ్వకపోవడంతో నెట్ ప్లిక్స్ ఓటీటీ ద్వారా స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా విడుదలకు సిద్ధం చేసారు.