Begin typing your search above and press return to search.
గన్నులు+తొడలు= వర్మ చరిత్ర
By: Tupaki Desk | 13 Nov 2015 9:30 AM GMTరామ్ గోపాల్ వర్మ అంటే ఓ చరిత్ర. జయాపజయాలకి అతీతమైన వ్యక్తి. దర్శకుడిగా ఎన్ని ప్లాపులొచ్చినా సరే ఆయన చేయాల్సిన సినిమా మరొకటి మిగిలే ఉంటుంది. ఆయన సినిమాలు చూడాలనుకొనే ప్రేక్షకులు కొంతమంది మిగిలే ఉంటారు. వర్మ ఏ భాషలో సినిమా చేస్తున్నా సరే ఆ సినిమా గురించి అన్ని పరిశ్రమలవాళ్లూ మాట్లాడుకుంటుంటారు. దటీజ్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో కనిపిస్తుంటారు వర్మ. అలాంటి వర్మ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికి మాత్రం ఉండదు. అందుకే వర్మ గురించి, ఆయన జీవితం గురించి తరచుగా పుస్తకాలొస్తుంటాయి.
స్వతహాగా ఆయన కూడా నా ఇష్టం అంటూ ఆమధ్య ఓ పుస్తకాన్ని రాశాడు. విశేషంగా పాఠకాదరణ పొందింది. అయితే నా ఇష్టం కేవలం తెలుగులోనే ప్రచురితమైంది. మరి తెలుగు రాని పాఠకుల సంగతేంటి? అందుకే వారికోసమే అన్నట్టుగా ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఇంగ్లీషులోనూ ఓ పుస్తకం రాశాడు. గన్స్ అండ్ థైస్ పేరుతో ఆ పుస్తకం విడుదల కాబోతోంది. ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అంటూ రామ్‌గోపాల్ వర్మ ఈ పుస్తకాన్ని రచించాడు. గన్స్ అండ్ థైస్ అంటే తెలుగులో గన్నులు - తొడలు అనే అర్థం వస్తుంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎక్కువగా అమ్మాయిల అందం - పేలే గన్నుల ఆధారంగానే రూపొందాయి. అందుకే ఆ రెండు మాటల్ని వాడుతూ తన పుస్తకానికి పేరుగా ఫిక్స్ చేశారు. రూప పబ్లికేషన్స్ సంస్థ వచ్చే నెలలో ఆ పుస్తకాన్ని విడుదల చేయబోతోంది.