Begin typing your search above and press return to search.
గుంటూరు కారం.. ఎంతకాలమిలా?
By: Tupaki Desk | 20 Jun 2023 6:14 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ గత ఏడాది మేలో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఏడాది పూర్తయ్యింది. కాని కేవలం రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి.
ఇప్పటికి కూడా సగం షూటింగ్ కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సూపర్ స్టార్ ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ రిలీజ్ చేయాలని గత సంవత్సరం డేట్ ఫిక్స్ చేశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయిపొయింది. తరువాత ఆగష్టు 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
జనవరి నుంచి సూపర్ స్టార్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కి సిద్ధం కాలేదు. దాంతో పాటు క్యాస్టింగ్ కూడా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్న సమ్మర్ ఎఫెక్ట్ తో మహేష్ బాబు ఆసక్తి చూపించలేదు. దీంతో మూడో షెడ్యూల్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. జులై మొదటి వారం నుంచి మొదలు పెట్టాలని మాటల మాంత్రికుడు ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఇంకా కంప్లీట్ గా క్యాస్టింగ్ ఎవరూ ఖరారు కాలేదంట. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎందుకనో ఆలస్యం చేస్తోన్నట్లు తెలుస్తోంది. జులైలో కూడా షూటింగ్ స్టార్ట్ కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సంక్రాంతి రిలీజ్ డేట్ కు పక్కా వస్తుందని చెప్పినప్పటికీ కూడా బ్యాక్ కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఆఖరులో రాజమౌళి సినిమా వర్క్ షాప్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
మరి అప్పటికైన సూపర్ స్టార్ త్రివిక్రమ్ సినిమాని కంప్లీట్ చేస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా అల వైకుంఠపురంలో సినిమాలోతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ తరువాత భీమ్లానాయక్, బ్రో సినిమాలలో డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. సూపర్ స్టార్ కి సూపర్ సక్సెస్ ఇవాలని ప్రయత్నం చేస్తోన్నారు. అలాగే నెక్స్ట్ అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు లేట్ చేస్తూ ఉండటం గుంటూరు కారం అలా వెనక్కి వెళ్ళిపోతోంది.