Begin typing your search above and press return to search.

ఇషా గుప్తా స్ట‌న్నింగ్ డెనిమ్ లుక్..!

By:  Tupaki Desk   |   22 April 2021 12:30 AM GMT
ఇషా గుప్తా స్ట‌న్నింగ్ డెనిమ్ లుక్..!
X
ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఇషాగుప్తా వేవ్ అంతా ఇంతా కాదు. మాజీ మిస్ ఇండియాగా ఇషాజీ అందాల పోటీల‌కు న‌వ‌త‌రం ట్యాలెంట్ ని సిద్ధం చేస్తూ ద‌శాబ్ధాల పాటు సేవ‌లందిస్తున్నారు. ఫెమీనా మిస్ ఇండియాకి జ‌డ్జీగా కొన‌సాగుతూ ఇషా గుప్తా ఎంతో ప్ర‌తిభను వెలికి తీసారు.

భార‌త‌దేశంలో డిజైన‌ర్ లుక్ ప‌రంగా ఇషాజీ ప్ర‌యోగాలు ఆస‌క్తిక‌రం. ఇక బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ .. స్విమ్ సూట్ యాక్ట్ లో ఇషా మోస్ట్ సీనియ‌ర్. ఒంట‌రి దీవుల్లో మంట‌లు పెడుతూ ఇషాజీ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో ఎప్పుడూ వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా అందుకు భిన్నంగా.. టాప్ టు బాట‌మ్ డెనిమ్ లుక్ లో ఇషాజీ టీజ్ చేసిన తీరు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎండ‌లో అది కూడా ఎడారిలో ఇషా గుప్తా ఫోటోషూట్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. బ్లూ షేడెడ్ డెనిమ్ మిడ్డీ త‌ర‌హా డ్రెస్ .. దానికి కాంబినేష‌న్ గా బూడిద రంగు గాగుల్స్ తో గుప్తాజీ దుమారం రేపుతున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. హీట్ పెంచ‌డంలో ఈషా మ్యాడ‌మ్ త‌ర్వాతే అంటూ అభిమానులు ఈ లుక్ పై కాంప్లిమెంట్లు చేస్తున్నారు

2012లో జ‌న్న‌త్ చిత్రంతో క‌థానాయిక‌గా కెరీర్ ప్రారంభించిన ఇషా గుప్తా డ‌జ‌ను పైగానే బాలీవుడ్ చిత్రాల్లో న‌టించారు. స‌చిన్ జోషి వీడెవ‌డు అనే హార‌ర్ చిత్రంలోనూ గుప్తాజీ న‌టించారు. ప్ర‌స్తుతం హేరాఫేరి 3.. దేశీ మ్యాజిక్ లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ముంబైలో షూటింగులు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.