Begin typing your search above and press return to search.
‘గురు’ తొలి రోజు ఎంత తెచ్చాడు?
By: Tupaki Desk | 1 April 2017 10:11 AM GMTవిక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ మీద విడుదలకు ముందు అంజ్ హైప్ లేని మాట వాస్తవం. ఇది కమర్షియల్ సినిమాలా కనిపించకపోవడం.. హీరోయిజం ఏమీ కనిపించకపోవడం.. పబ్లిసిటీ పెద్దగా చేయకపోవడం.. కొంచెం హడావుడిగా రిలీజ్ చేయడం వల్ల అనుకున్నంత బజ్ కనిపించలేదు. దీంతో వెంకీ లాస్ట్ మూవీ ‘బాబు బంగారం’ తరహాలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది ‘గురు’. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు రూ.2.51 కోట్ల షేర్ రాబట్టింది. వెంకీ లాంటి స్టార్ హీరో స్థాయికి ఇవి తక్కువ వసూళ్లే. ఐతే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు.. దీని బడ్జెట్ కోణంలో చూస్తే ఓపెనింగ్ డే కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నట్లు లెక్క.
‘గురు’కు పాజిటివ్ రివ్యూలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో అందరూ ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. తొలి రోజు మార్నింగ్ షో.. మ్యాట్నీలతో పోలిస్తే తర్వాతి రెండు షోలకు వసూళ్లు పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శని.. ఆదివారాల్లో ‘గురు’ ఇంకా మెరుగైన వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో టికెట్ రేట్లు తక్కువ పెట్టడం కలిసొస్తుందని.. వీకెండ్ వసూళ్లు బావుంటాయని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ షేర్ రూ.13-14 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. అదే జరిగితే ఈ సినిమా ప్రాఫిట్ జోన్లోకి వెళ్లడం ఖాయం. ఈ చిత్రాన్ని రూ.10 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కించారు. వెంకీ పారితోషకం బదులు లాభాల్లో వాటా తీసుకోనున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/