Begin typing your search above and press return to search.
'మహర్షి' రైతు ప్రస్థానం ఇది
By: Tupaki Desk | 14 May 2019 11:44 AM GMT'మహర్షి' చిత్రం కు మంచి టాక్ వచ్చింది. మహేష్ బాబు 25వ చిత్రం అవ్వడంతో పాటు - వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన కారణంగా ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మహర్షి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించబోతున్న సినిమాగా నిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంతటి సంచలన చిత్రంలో చిన్న పాత్ర పోషించిన నటుడు గురుస్వామి గురించి ప్రస్తుతం అంతా మాట్లాడుకుంటున్నారు. రైతు పాత్రలో గురు స్వామి నటించిన తీరు - ఆయన రైతుల గురించి చెప్పిన డైలాగ్ సినిమా స్థాయిని పెంచాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాకు చాలా కీలకంగా మారిన గురుస్వామి గురించి ఇప్పుడు అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఎక్కువ శాతం జనాలు గురుస్వామి నిజంగానే రైతు అయ్యి ఉంటాడని భావిస్తున్నారు. కాని కర్నూలుకు చెందిన ఈ గురుస్వామి రైతు కాదు - బీఎస్ ఎన్ లో ఉద్యోగం చేసి 2003 లో పదవి విరమణ చేశాడు. ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు మరియు ఇతర సమస్యల నుండి బయట పడేందుకు, ఆ సమస్యల నుండి దృష్టి మరలేందుకు నాటకాలు వేయడం మొదలు పెట్టాడు. 1960వ సంవత్సరంలో మొదటి సారి గురుస్వామి నేటి విద్యార్థి అనే నాటకం వేశాడు. ఉద్యోగిగా కూడా పలు నాటకాలు వేశాడు. పదవి విరమణ తర్వాత గురుస్వామి నాటకాలు కొనసాగించడంతో పాటు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా చేశారు.
గురుస్వామి మరియు ఆయన స్నేహితుడు అజీజ్ దర్శకత్వంలో 'అజీజ్' దర్శకత్వంలో ఆయుష్మాన్ భవ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ తో దిల్ రాజు ఆఫీస్ కు చేరుకుని అసిస్టెంట్ డైరెక్టర్ హరికి చూపించారట - ఆయన కో డైరెక్టర్ రాంబాబుకు చెప్పగా - ఆడిషన్స్ కు రమ్మని గురుస్వామికి రాంబాబు నుండి పిలుపు వచ్చిందట. రైతు కాస్ట్యూమ్స్ వేసి దిల్ రాజు - వంశీ - మహేష్ బాబు ముందుకు తీసుకు వెళ్లగా వారు నచ్చి సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. మూడు నెలల పాటు మహర్షి టీంతో కలిసి గురుస్వామి జర్నీ చేశాడట. 25 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తి చేసినట్లుగా గురి స్వామి చెప్పుకొచ్చాడు. తనకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు వంశీ మరియు మహేష్ బాబు గారికి ఎప్పటికి రుణపడి ఉంటానంటూ గురు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.