Begin typing your search above and press return to search.

అన్నాచెల్లెళ్లు పూల్ లో కోతిక‌మ్మ‌చ్చి!

By:  Tupaki Desk   |   19 March 2020 6:30 AM GMT
అన్నాచెల్లెళ్లు పూల్ లో కోతిక‌మ్మ‌చ్చి!
X
వెకేష‌న్స్ ఎంజాయ్ చేయాలంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త జంట తర్వాత‌నే. కిడ్స్ గౌత‌మ్ .. సితారల‌తో క‌లిసి షికార్లు చేయ‌డం వీళ్ల‌కో హ్యాబిట్. మొన్న‌టివ‌ర‌కూ అమెరికాలో వెకేష‌న్ ని ఎంజాయ్ చేసి వ‌చ్చారు. ఆ త‌ర్వాత మ‌హేష్ స్క్రిప్టుల్ని ఫైన‌ల్ చేసే ప‌నిలో పడితే.. కిడ్స్ స్కూళ్ల‌లో పుస్త‌కాల‌తో కుస్తీలు ప‌ట్టారు. బిజీ లైఫ్ య‌థాత‌థంగా మొద‌లైంది.

అయితే ఇంత‌లోనే క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ త‌రుముకు రావ‌డం.. భార‌త్ లో పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న సంకేతం అంద‌డంతో.. అటుపై టీ-ప్ర‌భుత్వం స్కూళ్లకు సెల‌వులు ఇచ్చేసింది. ఈనెల 31 వ‌ర‌కూ సెల‌వులే సెల‌వులు. ఇంకేం ఉంది ఆయాచితంగా క‌లిసొచ్చిన స‌మ్మ‌ర్- క‌రోనా సెల‌వుల్ని ఇదిగో ఇలా సెల‌బ్రేట్ చేస్తున్నారు. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స్విమ్మింగ్ పూల్ సెల‌బ్రేష‌న్స్ కి వెళ్లారు. అక్క‌డ అన్నా చెల్లెళ్లు ఇద్ద‌రూ కోతిక‌మ్మ‌చ్చి ఆడుకుంటున్నారు.

ఇదే విష‌యాన్ని న‌మ్ర‌త ఇలా ఫోటోను షేర్ చేసి వెల్ల‌డించారు. ఒక‌రి వీపు మీద ఒక‌రు ఎక్కి ఇదిగో ఇలా ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తున్నారు అన్నా చెల్లెళ్లు ఇద్ద‌రూ. ``పుస్త‌కాలు ప‌క్క‌న వేసి స్కూల్ భారం లేకుండా .. స్వీట్ క్రేజీస్ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. వాట‌ర్ బేబీస్`` అంటూ మామ్ న‌మ్ర‌త‌ ఆనందం వ్య‌క్తం చేశారు. త‌మ ఇల్లు స్వీట్ హోమ్!! అంటూ సెల‌బ్రేష‌న్ మూవ్ మెంట్ ని షేర్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. సూప‌ర్ స్టార్ ఇంకా ఎందుక‌ని స్క్రిప్టుని ఫైన‌ల్ చేయ‌డం లేదు. వంశీ పైడిప‌ల్లిని ప‌క్క‌న పెట్టి ప‌ర‌శురామ్ కి ఓకే చెప్పేసిన‌ట్టేనా? ముహూర్తం ఎప్పుడు? ఇలాంటి విష‌యాలేవీ షేర్ చేయ‌లేదు ఎందుక‌నో! వ్వాటీజ్ దిస్ నమ్ర‌తా మ్యామ్!!