Begin typing your search above and press return to search.

గుత్తా జ్వాల డిమాండ్.. అందుకే టాలీవుడ్ లో FIR

By:  Tupaki Desk   |   6 Feb 2022 6:34 AM GMT
గుత్తా జ్వాల డిమాండ్.. అందుకే టాలీవుడ్ లో FIR
X
కోలీవుడ్ న‌టుడు విష్ణు విశాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. రానా క‌థానాయ‌కుడిగా న‌టించిన `అర‌ణ్య` చిత్రంలో విష్ణు విశాల్ కీల‌క పాత్ర పోషించి టాలీవుడ్ ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో న‌టించిన `ఎఫ్.ఐ.ఆర్` త‌మిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విష్ణు విశాల్ తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో `ఎఫ్.ఐ.ఆర్` గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ``సినిమా ద‌ర్శ‌కుడు మ‌ను ఆనంద్ గౌత‌మ్ మీన‌న్ శిష్యుడు. ఇత‌ను మొద‌ట యాక్ష‌న్ క‌థ‌తో అప్రోచ్ అయ్యాడు. కానీ అది కుదర్లేదు. ఆ త‌ర్వాత `ఎఫ్ ఐఆర్` స్క్రిప్ట్ విన్న వెంట‌నే లాక్ చేసాను.

ఇదొక ఇంటెన్స్ స‌బ్జెక్ట్ . ఈ చిత్రాన్ని నా మిత్రుడు నిర్మించాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల నేనే నిర్మాత‌గా మారాను. నాన్న‌గారు పోలీస్ అధికారి కావ‌డం వ‌ల్ల దేశ‌మంతా వివిధ‌ రాష్ట్రాల్లో ఉన్నాను. అలా నాకు కులం..మ‌తం..ప్రాంతం అనే న‌మ్మ‌కం లేదు. మ‌నుషులంతా ఒక్క‌టే అని న‌మ్మేవాడిని. నేను బేసిక్ గా క్రికెట‌ర్ ని. అందువ‌ల్లే స‌య్య‌ద్ అహ్మ‌ద్ నాకు ద‌గ్గ‌ర‌య్యాడు. మతం మా స్నేహానికి ఎప్పుడు భంగం క‌లిగించ‌లేదు. కానీ స‌మాజంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అలాగ‌ని మేము ఏ మతం మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌లేదు. మ‌తం ఏదైనా అన్నింటిని మించిన‌ది మాన‌వ‌త్వం. ఇదే సందేశంతో ఈ సినిమా సాగుతుంది.

ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు చాలా రీసెర్చ్ చేసాడు. ఒక ముస్లీం అబ్బాయికి నిజ జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ని సినిమాలో చూపించాం. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప్ర‌పంచంలో మతం నేప‌థ్యంలో జ‌రుగుతుంటాయి. సినిమాలో కుల‌మ‌తాల్ని కించ‌ప‌రిచేలా ఎలాంటి స‌న్నివేశాలు లేవు. సెన్సార్ టీమ్ రెండు.. మూడు పదాల్ని మాత్ర‌మే మ్యూట్ చేసింది. పెద్ద‌గ్ క‌ట్స్ లేవు. గౌత‌మ్ మీన‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్. ఆయ‌న తెర‌కెక్కించిన `సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్` లో సూర్య‌ని ప్ర‌జెంట్ చేసిన విధానం నాలో స్ఫూర్తిని నింపింది. ఆయ‌న మా సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంది. ఇక `ఎఫ్ ఐ ఆర్` ని ఎలాగైనా తెలుగు రిలీజ్ చేయాల‌ని నా భార్య గుత్త‌జ్వాల డిమాండ్.

వాస్త‌వానికి `రాత్సస‌న్` ని రిలీజ్ చేయ‌మ‌ని కోరింది. కానీ ఆ సినిమా నిర్మాణంతో నాకు సంబంధం లేదు కాబ‌ట్టి వీలు ప‌డ‌లేదు. కానీ `ఎఫ్ ఐఆర్` సొంత ప్రాజెక్ట్ కాబ‌ట్టి డిమాండ్ చేయ‌డంతో త‌ప్ప‌లేదు. నేను ర‌వితేజ‌ని క‌లిసిన‌ప్పుడు స్క్రిప్ట్ ఎంపిక‌లో నా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. నా మాస్ హీరో క‌ల‌ని ఆయ‌న ముందు ఉంచాను. కొన్ని స‌ల‌హాలు ఇచ్చారు. ఈ సినిమా ర‌ఫ్ క‌ట్ చూసారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నాం. నా కెరీర్ లోనే `ఎఫ్ ఐ ఈర్` పెద్ద బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. ముందుగా ఓటీటీలో రిలీజ్ చేయాల‌నుకున్నాం. కానీ సినిమా చూసిన త‌ర్వాత ఇది థియేట‌ర్ రిలీజ్ సినిమా అని డిసైడ్ అయ్యాం. ఫిబ్ర‌వ‌రిలో సినిమా థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తున్నాం. `ఎఫ్ ఐ ఆర్` మీనింగ్ కోసం థియేట‌ర్ కి రావాల్సిందే`` అని అన్నారు.