Begin typing your search above and press return to search.
ట్విట్టర్ లో బబితాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన గుత్తా జ్వాల
By: Tupaki Desk | 18 April 2020 7:30 PM GMTకరోనా కేసులు పెరగడానికి కారణం ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని.. ఈ సందర్భంగా ఓ మతాన్ని కించపర్చేలా భారత స్టార్ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ చేసిన ట్విట్టర్లో పోస్టులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ట్వీట్లపై తీవ్ర దుమారం రేగింది. కొందరిలో బబితా విద్వేషాన్ని రెచ్చగొడుతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాలోవర్స్‌తో పాటు నెటిజన్లు ఎంతోమంది ఆమె తీరును ఖండిస్తూ ట్వీట్లు చేశారు. అయితే వాటిని చూసిన బబితా ట్విట్టర్లో స్పందించింది. 'నేను ఎవరికీ భయపడను. ఈ ట్వీట్లు చేసిన తర్వాత నుంచి తనను సోషల్ మీడియాలో పలువురు బెదిరిస్తున్నారు. నేను ఏమి తప్పుగా మాట్లాడలేదు, నా వ్యాఖ్యాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా' అని బబితా స్పష్టం చేసింది. అయితే దీనిపై కూడా వివాదాలు రేగుతున్నాయి. ఈ క్రమంలో ఈ అంశంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందిస్తూ సుత్తిమెత్తగానే బబితాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
వివాదాస్పద ట్వీట్ తొలగించాలని గుత్తా జ్వాల కోరింది. ఈ సందర్భంగా ట్వీట్‌లో 'సారీ బబితా. ఈ కరోనా వైరస్ జాతి లేదా మతాన్ని చూస్తుందని అనుకోను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం స్పోర్ట్స్ పర్సనాలటీలం. మనం దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మనం గెలిచినప్పుడు ప్రజలంతా కులాలు-మతాలు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. మన విజయాల్ని వారి గెలుపులుగా భావిస్తారు' అని జ్వాల పేర్కొంటూ బబితాకు కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది.
'నేను విమర్శలు ఎదుర్కొన్నప్పుడు భారతీయురాలిగానే ఉన్నా, అదే సమయంలో నేను పతకాలు గెలిచినప్పుడు ఎవరూ ఏమతం అనేది చూడలేదు. ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని భారతీయులగా మాత్రమే గుర్తించారు. ప్రతీ ఒక్కరూ ఆమె విజయాన్ని వారి విజయంగానే చూశారు. సమైక్యతే మన బలమని, దేశాన్ని విడగొట్టద్దు' అని ఈ సందర్భంగా బబితాకు పరోక్షంగా గుత్తా జ్వాల సూచించారు. ఒక వర్గాన్ని కించపరిచేలా క్రీడాకారులు ఉండకూడదని.. దేశానికి కొంత బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా గుత్తా జ్వాల ఇచ్చిన ట్వీట్‌ను చూసి బదులిస్తున్నారు. మరికొందరు జ్వాల ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. బబితా తన వైఖరి మార్చుకోవాలని, రాజకీయ నాయకురాలిగా మాట్లాడడం సరికాదని హితవు పలుకుతున్నారు.