Begin typing your search above and press return to search.

కెమిస్ట్రీ మరీ పండించేస్తున్నారుగా!!

By:  Tupaki Desk   |   22 Jan 2018 11:30 AM IST
కెమిస్ట్రీ మరీ పండించేస్తున్నారుగా!!
X
టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించిన మూవీ 100పర్సెంట్ లవ్. నాగచైతన్య- తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో తెలిసిందే. సుకుమార్ మేకింగ్ తో పాటు.. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఈ మూవీకి చాలా కీలకం. బావా మరదళ్లుగా చెయ్-మిల్కీ బ్యూటీల కెమిస్ట్రీ హైలైట్ నిలిచింది.

ఇప్పుడీ సినిమాను తమిళ్ లో 100 పర్సెంట్ కాదల్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కంపోజర్ కం హీరో జీవీ ప్రకాష్.. అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండేలు జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిపోయింది. మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి వెళ్లేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. మరోవైపు ప్రమోషన్ పనులను కూడా యూనిట్ ప్రారంభించేంసింది. ఇందులో భాగంగా హీరో హీరోయిన్ల పోస్టర్లను విడుదల చేస్తున్నారు. చైతు-తమన్నాలను మించి.. మరింతగా జీవీ ప్రకాష్-షాలినీ పాండే కెమిస్ట్రీ వర్కవుట్ చేస్తున్నట్లుగా ఉన్నారు.

సినిమా కోసం ఏ స్థాయిలో కెమిస్ట్రీ పండించగలదో షాలినీ పాండే ఇప్పటికే అర్జున్ రెడ్డిలో చూపించింది. ఇప్పుడు 100 పర్సెంట్ కాదల్ కోసం.. జీవీ ప్రకాష్ తో కలిసి దాదాపు అదే స్థాయిలో పండించేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు బావామరదళ్ల మూవీ కావడంతో.. ఈ సినిమాకి వీరిద్దరి మధ్య కనిపించే ఆన్ స్క్రీన్ అనుబంధమే హైలైట్ అని చెప్పవచ్చు.