Begin typing your search above and press return to search.
బ్రూస్ లీ మీద పగబట్టిన బ్రూస్ లీ 2
By: Tupaki Desk | 27 Oct 2015 5:41 AM GMTరామ్ చరణ్ బ్రూస్ లీ వచ్చేస్తోంది అనగానే బోలెడంత హడావుడి. థియేటర్లన్నీ బంద్. వేలాది థియేటర్లు బుక్ చేసేశారు. ఇటు తెలుగు, అటు తమిళ్ రెండు చోట్లా బ్రూస్ లీ రిలీజ్ కోసం అడ్వాన్స్ బుకింగులే బుకింగులు. అయితే సరిగ్గా అదే టైమ్ లో అనూహ్యంగా జీ.వీ.ప్రకాష్ హీరోగా బ్రూస్ లీ అంటూ ఓ టైటిల్ ప్రకటించేశాడు. అప్పటికే ఆ టైటిల్ ను కూడా రిజిష్టర్ చేయించుకున్నాడట. అందుకే మన చెర్రీ సినిమాను ''బ్రూస్ లీ 2'' అంటూ తమిళంలో రిలీజ్ చేశారు. చరణ్ సినిమా టైటిల్ మార్చాలని జివి ప్రకాష్ ఎంత కోరినా కూడా.. మనోళ్ళు మార్చలేదు.
కారణం ఏదైనా తెలుగు బ్రూస్ లీకి, తమిళ బ్రూస్ లీకి కావాల్సినంత ప్రచారం వచ్చేసింది. అయితే ఇప్పుడిక జివి తీస్తున్న 'బ్రూస్ లీ' ని తెలుగులో ఏ పేరుతో రిలీజ్ చేయాలి? ఇప్పుడిక చరణ్ మీద రివెంజ్ అన్నట్లు.. తెలుగు వెర్షన్ కి బ్రూస్ లీ 2 అని పెట్టుకున్నట్లు చెబుతున్నాడు. మీ బ్రూస్ లీని ఎలా ఢీకొడతానో చూడు అన్నట్టే ఉంది అతడి వ్యవహారం.చరణ్ బ్రూస్ లీ వచ్చింది. వెళ్లింది. ఇక జీవీ బ్రూస్ లీ చిత్రీకరణ నవంబర్ లో మొదలవుతోంది.
అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి కనీసం మూడు నాలుగు నెలలైనా పడుతుంది. అయితే ఈలోగానే చరణ్ బ్రూస్ లీ తో పాటు తమకి కావాల్సిన ప్రచారం చేసేసేకున్నారు తంబీలు తెలివిగా. మీ బ్రూస్ లీ ఫ్లాప్ - మా బ్రూస్ లీ హిట్టు అంటూ ఒకవేళ సక్సెస్ వస్తే.. జీవీ అప్పటికి రెచ్చిపోతాడేమో చూడాలి.