Begin typing your search above and press return to search.

రహమాన్‌ అంటే భయం..అంతొద్దన్న రహమాన్‌

By:  Tupaki Desk   |   3 Dec 2018 12:16 PM GMT
రహమాన్‌ అంటే భయం..అంతొద్దన్న రహమాన్‌
X
ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ సంగీత దర్శకుడిగా - భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచే ఏ ఆర్‌ రహమాన్‌ తన అల్లుడు జీవీ ప్రకాష్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశాడు. జీవీ ప్రకాష్‌ సంగీత దర్శకుడిగా చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. చిన్న వయస్సులో సంగీత దర్శకుడిగా గుర్తింపు దక్కించుకుని - ఇప్పుడు హీరోగా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా జీవీ హీరోగా ‘సర్వం తాళమయం’ అనే చిత్రం తెరకెక్కింది. సంగీత నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియాలో జీవీ ప్రకాష్‌ చిట్‌ చాట్‌ చేశాడు.

జీవీ ప్రకాష్‌ మరియు దర్శకుడు రాజీవ్‌ మీనన్‌ ఫేస్‌ బుక్‌ లైవ్‌ లోకి వచ్చారు. ఆ సందర్బంగా పలువురు జీవీ ప్రకాష్‌ ను పలు ప్రశ్నలను అడిగారు. ఆ సమయంలో ఒక అభిమాని రహమాన్‌ గారితో మీరు ఎలా ఉంటారు అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో జీవీ స్పందిస్తూ.. రహమాన్‌ సర్‌ అంటే నాకు చాలా భయం. ఆయన వద్ద అసిస్టెంట్‌ గా చేసే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు. మామ అయినా కూడా జీవి పట్ల రహమాన్‌ చాలా సీరియస్‌ గా ఉండేవాడన్నమాట.

జీవీ ప్రకాష్‌ వ్యాఖ్యలపై వెంటనే రహమాన్‌ స్పందించాడు. నేను నిన్ను ఒక్కసారి మాత్రమే తిట్టాను. కాని నవ్వు మాత్రం ఎన్నో సార్లు తిటినట్లుగా ఇంకా భయపడుతున్నావు. మరీ అంతగా నవ్వు భయపడ్డావా అంటూ ప్రశ్నించాడు. నీ భయమంతా కూడా నటనే కదా, నీవు మంచి నటుడివి అని ఇప్పటికే నిరూపించుకున్నావు, నా విషయంలో అంత భయం నటించొద్దు అంటూ రహమాన్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. మొత్తానికి ఈమామ అల్లుడి సంభాషణ సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.