Begin typing your search above and press return to search.
హిట్టు కోసం హారికా హాసిని అడుగులు
By: Tupaki Desk | 7 Jun 2019 6:13 AM GMTతాను ఏ హీరోతో చేసినా ఖచ్చితంగా అది హారికా హాసిని బ్యానర్ లోనే అని కండిషన్ పెట్టి మరీ సినిమాలు ఒప్పుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆ సంస్థ అధినేత ఎస్ రాధాకృష్ణకు ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో కాకుండా బయట చేయడు గాక చేయడు. అందుకే అల్లు అర్జున్ 19వ సినిమాకు గీత ఆర్ట్స్ దీంతోనే టై అప్ అవ్వాల్సి వచ్చింది. ఒకవేళ బయట దర్శకుడితో హారికా హాసిని ఏదైనా సినిమా తీయాలన్నా దానికీ త్రివిక్రమ్ ఆమోదం అవసరం.
ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడీ బ్యానర్ కు సాలిడ్ గా బ్లాక్ బస్టర్ పడి చాలా కాలమయ్యింది. వస్తే బ్రేక్ ఈవెన్ ప్రాజెక్ట్ లేదా నష్టాలు రావడం గట్టెక్కడం ఇలా జరుగుతోందే తప్ప నిఖార్సుగా గర్వంగా చెప్పుకునే సక్సెస్ ఇంకా దక్కలేదు. అరవింద సమేత వీర రాఘవ 90 కోట్లు తెచ్చిందని సంతోషపడినా దానికి జరిగిన బిజినెస్ కి చెల్లుకి చెల్లు అయ్యింది కానీ పెద్దగా మిగిలింది ఏమి లేదు. క్రేజీ హీరోలతో చేస్తున్న ఇలాంటి రిజల్ట్స్ రావడం ఎంతైనా ఖంగారు కలిగించే విషయమే.
ఇప్పుడు నితిన్ తో ప్లాన్ చేసుకున్న భీష్మ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనేలేదు. ఇది ఆరు నెలల క్రితమే ఓకే అయిన సినిమా. ఈ నెలలో పక్కా అంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిన మాట వాస్తవం. మరోపక్క అల్లు అర్జున్ మూవీ కూడా ఏమంత వేగంగా వెళ్లడం లేదు. మొన్న స్టార్ట్ అయిన సెకండ్ షెడ్యూల్ నుంచి స్పీడ్ పెంచారు కానీ అంతకు ముందు చాలా సార్లు ఇదీ పురిటినెప్పులు పడ్డ స్క్రిప్టే.
ఇలా అన్ని రకాల సమీకరణాలు చెక్ చేసుకుని మరీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికే సిస్టర్ కన్సర్న్ గా ఉన్న సితార బ్యానర్ కూడా ఇది రీతిలో సాగుతోంది. అందరూ ఆకాశానికి ఎత్తేసిన జెర్సీ కమర్షియల్ గా కనీసం 30 కోట్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వరసగా సినిమాలతో తొందరపడకుండా స్లో అయినా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారట