Begin typing your search above and press return to search.
గజరాజుగా రానా
By: Tupaki Desk | 30 Nov 2017 2:17 PM GMTటాలీవుడ్ స్టార్ హీరో రానా బాహుబలి తర్వాత అన్ని విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటివరకు వచ్చిన కథలన్నీ చాలా వినూత్నంగా తెరకెక్కినవే. ఘాజి - నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు విభిన్న కథల తర్వాత మళ్లీ ఈ దగ్గుబాటి హీరో మరో వెరైటీ కథను ఎంచుకున్నడు. అది కూడా ఏనుగులకు సంబందించిన కథ అని తెలుస్తోంది.
కోలీవుడ్ లో స్టార్ డైరక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ప్రభు సాలోమన్ దర్శకత్వలో 1971 లో వచ్చిన హాతీ మేరే సాథి అనే కథ ఆధారంగా దర్శకుడు కథను రాసుకున్నాడట. రాజేష్ ఖన్నా హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఒక ఏనుగు మరియు మనిషికి మధ్య సాగే ఆ కథలో సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయట.
ఈ దర్శకుడు ఇంతకుముందు తమిళ్ లో తెరకెక్కించిన గజరాజు(కుంకి) - ప్రేమ ఖైది (మైనా) సినిమాలను ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాడు. ఇక ఇప్పుడు ఒకేసారి తమిళ్ - తెలుగు - హిందీ లో సినిమాను చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. కథ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. రానా కూడా సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. ఇక అన్ని సెట్ అయితే వచ్చే ఏడాది జనవరిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.