Begin typing your search above and press return to search.

నటనకు పనికి రాడు అన్నవారే స్టార్‌ అంటూ కీర్తిస్తున్నారు

By:  Tupaki Desk   |   8 Aug 2021 9:43 AM GMT
నటనకు పనికి రాడు అన్నవారే స్టార్‌ అంటూ కీర్తిస్తున్నారు
X
మలయాళ స్టార్‌ ఫాహద్ ఫాజిల్‌ తండ్రి ప్రముఖ దర్శకుడు అవ్వడం వల్ల రెండు పదుల వయసు కూడా రాకుండానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలపై మోజుతో డిగ్రీలో ఉన్న సమయంలోనే తండ్రి దర్శకత్వంలో సినిమాను చేశాడు. ఆ సినిమాలో మమ్ముటీ కీలక పాత్రలో నటించారు. 2002 సంవత్సరంలో మొదటి సినిమా కైయేథుమ్‌ దురత్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పర్చింది. ఫాహద్ నటన విషయంలో ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు. ఇలాంటి వ్యక్తినిఎలా నటుడిగా తీసుకు వచ్చారంటూ ఆయన తండ్రి పై కూడా విమర్శలు వచ్చాయి. నటుడిగా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఫాహద్‌ ఇక తనకు సినిమాలు పడవు అనే ఉద్దేశ్యంతో అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ చదువు కొనసాగించి కొన్నాళ్లు ఉద్యోగం వ్యాపారాలు కూడా చేశాడు. మళ్లీ 2009 సంవత్సరంలో ఇండియాకు తిరిగి వచ్చిన ఫాహద్‌ ఫాజిల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

2009 లో రీ ఎంట్రీ తర్వాత ఫాహద్‌ ఫాజిల్ ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్‌ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నటుడిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్ సౌత్‌ లోనే కాకుండా నార్త్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. పాన్ ఇండియా స్టార్‌ గా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. తెలుగు లో ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాను చేస్తున్నాడు. తమిళంలో కమల్‌ హాసన్‌ తో కలిసి విక్రమ్‌ సినిమాను చేస్తున్నాడు.

విక్రమ్‌ సినిమాను ఫాహద్‌ పాజిల్‌ తో కలిసి చేస్తున్నందుకు గాను కమల్‌ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఫాహద్‌ నటన గురించి కమల్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సినిమా లో ఆయన కళ్లతో ఎక్స్‌ ప్రెషన్స్ పలికించగల అద్బుత నటుడు అంటూ కామెంట్స్ చేశాడు. ఇండియాలో ది బెస్ట్‌ నటుల్లో ఖచ్చితంగా ఫాహద్‌ పాజిల్ ఉంటాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలపై దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయన హీరోగా నటించినా.. విలన్ గా చేసినా మరే రకంగా నటించినా కూడా ఆయన కోసం సినిమాలు చూసే వారు చాలా మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. నేడు ఫాహద్‌ పాజిల్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు మా తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.