Begin typing your search above and press return to search.

ఒకే రోజు అర డజను సినిమాలు.. ఒక్క చిత్రానికే క్రేజ్..!

By:  Tupaki Desk   |   14 Jun 2022 4:30 AM GMT
ఒకే రోజు అర డజను సినిమాలు.. ఒక్క చిత్రానికే క్రేజ్..!
X
పాండమిక్ తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే థియేటర్లకు పూర్వ వైభవం వస్తోంది. కరోనా సంక్షోభంతో కళ తప్పిపోయిన థియేటర్లు.. ప్రేక్షకులు ఎప్పటిలాగే సినిమాకు చూడటానికి వస్తుందటంతో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

ఇప్పటికే సమ్మర్ సీజన్ లో పలు పాన్ ఇండియా సినిమాలు - మరికొన్ని పెద్ద హీరోల చిత్రాలు విడుదల కాబడి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు జూన్ - జులై నెలల్లో అనేక చిన్న మీడియం రేంజ్ సినిమాలు సందడి చేయడానికి రెడీ అయ్యాయి.

జూన్ లో ఫస్ట్ వీక్ లో విడుదలైన 'మేజర్' 'విక్రమ్' చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చిన 'అంటే సుందరానికి' '777 చార్లీ' సినిమాలు హిట్ టాక్ తో నడుస్తున్నాయి. ఈ నెల 17న 'విరాటపర్వం' 'గాడ్సే' వంటి తెలుగు చిత్రాలతో పాటుగా 'K3 కోటిగోబ్బ' అనే కన్నడ డబ్బింగ్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

ఇక నెల చివరి వారంలో ఏకంగా అర డజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా చిన్న సినిమాలే అవడం గమనార్హం. జూన్ 23న రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ''కొండా'' సినిమా విడుదల కానుంది. తెలంగాణ - వరంగల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన కొండా ముర‌ళి - సురేఖ‌ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇది.

సీనియర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన న్యూ ఏజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ''7 డేస్ 6 నైట్స్'' జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'డర్టీ హరి' తర్వాత ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

యువ హీరో కిరణ్ అబ్బవరం - చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ''సమ్మతమే'' కూడా అదే రోజున విడుదల కానుంది. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. శ్రీరామ్ - అవికాగోర్ కలిసి నటించిన 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా కూడా ఈ నెల 24వ తేదీనే వస్తోంది.

'గ్యాంగ్ స్టర్ గంగరాజు' 'ఒక పథకం ప్రకారం' వంటి మరో రెండు సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ కాబోతున్నాయి. క్యూలో ఆరు సినిమాలున్నా.. జూన్ 24న వచ్చే '7 డేస్ 6 నైట్స్' కు ఆడియన్స్ నుండి అటెన్షన్ వచ్చే అవకాశం ఉంది. యూత్ ని టార్గెట్ చేసే విధంగా మేకర్స్ అదే విధంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

ఎమ్మెస్ రాజు సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం చిత్రానికి అంతో ఇంతో క్రేజ్ ఉంది. ఈ క్రమంలో వచ్చే 'టెన్త్ క్లాస్ డైరీస్' యూత్ ఫుల్ సినిమా కావచ్చు. నిబ్బా నిబ్బి గ్యాంగ్‌ ని ఈ మూవీ టార్గెట్ చేయనుంది. మిగిలిన మూడు చిత్రాల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. మరి ఈ అర డజను చిత్రాల్లో ఏవేవి ప్రత్యేకత చాటుకుంటాయో.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధిస్తాయో చూడాలి.