Begin typing your search above and press return to search.
అరడజను సినిమాలు ఆగేది లేదంటున్నాయే!
By: Tupaki Desk | 29 Aug 2022 7:40 AM GMTటాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు కాస్త గ్యాప్ తో వస్తుంటే, చిన్న సినిమాలు ఒకే రోజున విరుచుకుపడినట్టుగా థియేటర్లకు వస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ చేసిన తరువాతనే ఓటీటీ లెక్కలు తేలుద్దాం అనే ప్రాసెస్ కారణంగానే, ఏ మాత్రం అవకాశం దొరికినా చిన్న సినిమాలు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నాయి. అలా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 2) ఓ రడజను సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఈ జాబితాలో కాస్త పెద్ద సినిమాగా 'రంగ రంగ వైభవంగా' కనిపిస్తోంది.
వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైంది. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై అందరిలో అంచనాలు పెంచాయి. లవ్ .. యాక్షన్ ... ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహించాడు. ఇటు యూత్ అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడం ఖాయంగా చెప్పుకుంటున్నారు. ఇక ఆ తరువాత స్థానంలో 'ఫస్టు డే ఫస్టు పోస్టర్' సినిమా కనిపిస్తోంది. 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ ఈ సినిమాకి కథను అందించడమనేది ప్రధానమైన బలంగా చెప్పుకుంటున్నారు.
సునీల్ ప్రధానమైన పాత్రను పోషించిన 'బుజ్జి ఇలా రా' సినిమా కూడా ఇదే రోజున థియేటర్లలో దిగిపోతోంది. ఇక 'డైహార్డ్ ఫ్యాన్స్' .. 'ఆకాశ వీధుల్లో' .. 'నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా' సినిమాలు అదే రోజున ప్రేక్షకులను పలకరించనున్నాయి.
దాదాపుగా ఈ సినిమాలన్నీ కూడా యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. కంటెంట్ ను నమ్ముకుని రంగంలోకి దిగినవే. మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ కొడుతున్న ట్రెండ్ ఇది. అందువలన కంటెంట్ ఉంటే కలిసొచ్చినట్టే.
అయితే ఈ సినిమాలకంటే రెండు రోజుల ముందుగానే విక్రమ్ 'కోబ్రా' సినిమా థియేటర్లకు రానుంది. బడ్జెట్ పరంగా ఇది భారీ సినిమా. విక్రమ్ కి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉండటం వలన, దీనిని డబ్బింగ్ సినిమాగా చూసే అవకాశం తక్కువ.
ఈ సినిమా హిట్ అయితే ఆ ప్రభావం మిగతా చిత్రాల వసూళ్లపై పడుతుంది. ఒకవేళ సెప్టెంబర్ 2న వస్తున్న 'రంగ రంగ వైభవంగా' హిట్ టాక్ తెచ్చుకున్నా, మిగతా సినిమాలు తట్టుకుని నిలబడటం కష్టమే. ఆ రోజున థియేటర్ల దగ్గర ఏం జరుగుతుందనేది చూడాలి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.