Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కఠిన పరిస్థితుల్లోనూ ఇలాంటి ఫోటోలు.. మీరు సూపర్‌

By:  Tupaki Desk   |   8 Jun 2023 10:06 AM GMT
పిక్ టాక్ : కఠిన పరిస్థితుల్లోనూ ఇలాంటి ఫోటోలు.. మీరు సూపర్‌
X
సీనియర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం సినిమా లో హీరోయిన్‌ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ హంసా నంది ని. అంతకు ముందు కూడా ఈమె కొన్ని సినిమాల ను చేయడం జరిగింది. ఆ సినిమాలు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు.

అనుమానాస్పదం సినిమా కు ముందు పూనం అనే పేరుతో ఈమె కొనసాగింది. అదే ఆమె ఒరిజినల్ నేమ్‌. అయితే వంశీ పేరు మార్చి హంసా నందిని అంటూ పెట్టడం జరిగింది. పేరు కలిసి వచ్చింది.. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు వరుస గా సినిమాలు చేస్తూ వచ్చింది.

స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించు కోలేక పోయింది. కానీ చాలా మంది స్టార్‌ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్ ను చేయడం లేదంటే కీలక పాత్రల్లో నటించడం జరిగింది. ప్రస్తుతం హంసా నంది ని క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. క్యాన్సర్ కారణంగా హంసా నందిని జుట్టు కోల్పోవాల్సి వచ్చింది.

సాధారణంగా ఎక్కువ మంది క్యాన్సర్‌ అనగానే భయం తో క్రుంగిపోతారు. కానీ హంసా నందిని మాత్రం చాలా ఆత్మవిశ్వాసం తో కనిపిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆమె తన అందమైన ఫోటో షూట్స్ ను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎంతో మంది కి ఆదర్శంగా నిలుస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో ఇలాంటి ఫోటో షూట్స్ తో జనాల్లో విశ్వాసం నింపుతున్నారు అంటూ చాలా మంది హంసా నందిని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.