Begin typing your search above and press return to search.
క్యాన్సర్ ని జయంచి మళ్లీ సెట్ లోకి వచ్చేసింది!
By: Tupaki Desk | 9 Dec 2022 8:30 AM GMTతెలుగు సినిమాల్లో నటించి హీరోయిన్ లుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ లలో కొంత మంది గత కొంత కాలంగా క్యాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల్ని పలు సినిమాలతో ఆకట్టుకున్న మనీషా కోయిరాలా, 'తమ్ముడు' సినిమా హీరోయిన్ లీసారే, సొనాలీ బెంద్రే, మమతా మోహన్ దాస్, మహిమా చౌదరి వంటి హీరోయిన్ లు క్యాన్సర్ బారిన పడి సక్సెస్ ఫుల్ గా బయటపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లలో కొంత మంది సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు కూడా.
ఇదిలా వుంటే వీరి తరహాలోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డానంటూ హీరోయిన్ హంసా నందిని కొన్ని నెలల క్రితం ప్రకటించి షాకిచ్చింది. వంశీ తెరకెక్కించిన 'అనుమానాస్పదం' మూవీతో హీరోయిన్ గా పరిచయమైన హంసా నందిని.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమాతో స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. 'కిట్టు వున్నాడు జాగ్రత్త' మూవీ వరకు మొత్తం ఎనిమిది సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ బారిన పడ్డానని, ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోందని ప్రకటించింది.
గుండుతో వున్న పలు ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ప్రాణాంతకమైన వ్యాధి తనకు జన్యు పరంగా సోకిందని, గతంలో తన తల్లికి వుండేదని, ఆమె దీని కారణంగానే చనిపోయిందని వెల్లడించి షాకిచ్చింది. అంతే కాకుండా అదే తనకు వచ్చిందని తెలిపింది. అయితే తాను మాత్రం క్యాన్సర్ ని జయిస్తానని, ప్రస్తుతం అందుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని, కీమో థెరపీ కారణంగా జట్టు తీసేయాల్సి వచ్చిందని గుండుతో చేతికి సెలెన్ బాటిల్ తో కనిపించి ఆశ్చర్యపరిచింది.
ఆ తరువాత డాక్టర్లు చెప్పిన విధంగా పాటిస్తూ అనుకున్నట్టుగానే హంసా నందిని మొత్తానికి క్యాన్సర్ ని జయింవచింది. ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న హంసా నందిని సినిమాలకు దూరంగా వుంటూ వచ్చింది.
తాజాగా తాను కోలుకోవడంతో మళ్లీ సెట్ లో సందడి చేయడం మొదలు పెట్టింది. మునుపటి జోష్ తో హంసానందని ఓ సినిమా సెట్ లో సందడి చేస్తున్న వీడియో ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
తన బర్త్ డే డిసెంబర్ 8న గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో హంసానందని సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేయడంతో పాటు కొత్త సినిమా షూటింగ్ లొకేషన్ కు సంబంధించిన ఫొటోలని, వీడియోస్ ని అభిమానులతో పంచుకుంది. 'సినిమా సెట్ లోకి రావడంతో నేను మళ్లీ పుట్టానని ఫీలవుతున్నాను. సినిమా టీమ్ తో నా బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్నాను. కెమెరా ముందుకు వచ్చిన క్షణాన నేను మళ్లీ బ్రతికే వున్నాననే ఫీలింగ్ కలిగింది. మీ ప్రేమ, సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నన్ను సపోర్ట్ చేసిన వారందరికి హంగ్గులు, కిస్సులు' అని పోస్ట్ పెట్టింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.