Begin typing your search above and press return to search.
సెంటిమెంట్ పాపకు బ్రేక్ ఇవ్వండయ్యా
By: Tupaki Desk | 21 Feb 2018 4:38 AM GMTకొంటె చూపుల సుందరాంగి హంసానందిని ఇండస్ర్టీలో చాలాకాలంగానే ఉంది. ఆమె నటించిన సినిమాల్లో సూపర్ హిట్లు.. అట్టర్ ఫ్లాపులు రెండూ ఉన్నాయి. తను నటించిన ప్రతి సినిమాలోనూ కాస్తంత వయ్యారం ఒలకబోస్తూ.. హుషారైన డ్యాన్సులతో మాయ చేస్తూనే ఉంది. కానీ అమ్మడికి సరైన బ్రేక్ మాత్రం ఇంతవరకు రాలేదు. అయితే మనోళ్ళు ఆమె ఉంటే చాలు సినిమా హిట్టే అన్నట్లు ఒక సెంటిమెంట్ సృష్టించారు. ఈగ నుండి మిర్చి వరకు.. అత్తారింటికి దారేది నుండి జై లవ కుశ వరకు.. ఆమె అడుగెడితే హిట్టే అన్నారు. సెంటిమెంట్ చేశారు. కాని ఆమె భాయ్.. బెంగాళ్ టైగర్.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి డిజాష్టర్లలో కూడా ఉంది.
ఇన్నాళ్లకు కెరీర్ లో తనకు గుర్తింపు తెచ్చే పాత్ర ఒకటి వచ్చిందని సంబర పడుతోంది హంసానందిని. గోపీచంద్ హీరోగా కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్ లో వచ్చే యాక్షన్ మూవీ ''పంతం''లో అమ్మడు ఓ కీలక రోల్ చేయబోతోంది. ఇందులో ఐశ్వర్యంలో మునిగితేలే అమ్మాయిగా ఆమె కనిపింబోతోంది. ‘‘ఈ సినిమా నా రోల్ గురించి విన్నప్పుడు కొత్తగా అనిపించింది. నాలుగు గోడల మధ్య నుంచి వచ్చి ఆరుబయటకు వచ్చి చల్లగాలి పీల్చిన విధంగా చాలా ఆనందపడిపోయా. నన్ను నేను కొత్తగా చూసుకునే అవకాశం ఉన్న పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పేశాను’’అని హంసానందిని ఈ రోల్ గురించి ఆనందంగా చెప్పుకొచ్చింది. ఏదేమైనా కూడా.. హీరోయిన్ గా చేద్దాం అని వచ్చిన పూనమ్ బర్తకే (అదే హంస అసలు పేరు) చివరకు ఇలా ఐటం బాంబ్ అయ్యింది. కాని మనోళ్ళు సెంటిమెంట్ అద్దేసి ఆమెను స్లో చేశారు. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారో.
పంతం సినిమాపై హంసానందినికే కాదు.. హీరో గోపిచంద్ కు బోలెడు ఆశలున్నాయి. చాలా రోజులుగా కమర్షియల్ హిట్ అన్నది గోపిచంద్ వైపు చూడటమే మానేసింది. రోజురోజుకు కెరీర్ గ్రాఫ్ తగ్గిపోతున్న తరుణంలో ఈ సినిమా అతడికి చాలా కీలకం. ఈమధ్య ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న మెహ్రీన్ ఇందులో హీరోయిన్. ఇలా ముగ్గురి కెరీర్ కు పంతం ఎంతవరకు లైఫిస్తుందో చూడాలి.