Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: గోవాకే గ్లామర్ అద్దిన హంస!

By:  Tupaki Desk   |   27 May 2019 4:53 PM GMT
ఫోటో స్టొరీ: గోవాకే గ్లామర్ అద్దిన హంస!
X
'మిర్చి' సినిమా టైటిల్ సాంగ్ 'మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే'.. 'అత్తారింటికి దారేది' లో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి పాటల్లో స్పెషాలిటీ ఏంటంటే స్టార్ హీరోలు ప్రభాస్.. పవన్ కళ్యాణ్ లు మాత్రమే కాదు.. వారితో ఆడిపాడి గ్లామర్ ఒలికించిన భామ హంసా నందిని కూడా స్పెషాలిటీనే. కానీ ఈమధ్య హంసా నందినికి ఎందుకో పెద్దగా ఆఫర్లు లేవు. హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తుండడంతో హంస లాంటి స్పెషల్ బ్యూటీలకు అవకాశాలు తగ్గడం కామనే.

అలా అని ఊరుకుంటే కొత్త అవకాశాలు ఎలా వస్తాయి చెప్పండి? అందుకే హంసా నందిని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హంస గోవాలో తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. పనిలో పనిగా బీచ్ లో దిగిన నాలుగు ఫోటోలను పోస్ట్ చేసింది. హంస వేసుకుంది బికినీయే కానీ సెమి బికిని అనుకోవాలి. ఎందుకంటే కింద నల్ల చుక్కలున్న తెల్ల స్కర్టు వేసుకుంది. అసలు ఆ పోజులు.. ఆ అందాలు వర్ణించాలంటే కాళిదాసు కానీ .. తిలక్ కానీ దిగిరావాలి. ఇక ఆ నాభి సౌందర్యంపైన ప్రత్యేకంగా ఐటెం కావ్యం రాయవచ్చు.

ఈ ఫోటోకు హంస "అందమైన లుక్ కోసం మంచి ఎమోషన్ పెడదామని అనుకున్నా మనసులో మాత్రం ప్రాన్ జకుటి ఆర్డర్ చెయ్యలా లేక క్రాబ్ రొషడో ఆర్డర్ చెయ్యాలా అని అలోచిస్తున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గోవాలో బీచ్ లో అందాలు ధారపోసి అరేబియా సముద్రంలో హీటు పెంచి తను మాత్రం సీఫుడ్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీలు తింటూ ఎంజాయ్ చేస్తుందన్న మాట. ఈ ఫోటోలకు నెటిజనులు ఇంట్రస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. ఒకరు "గోవాలో ఇదే పోజు తో స్టాచ్యూ ఆఫ్ హంస పెట్టాలి" అన్నారు. ఈ దేశంలో దేశ నాయకుల విగ్రహాలతో పాటుగా కొందరు జఫ్ఫాల విగ్రహాలు కూడా ఉన్నాయి. మరి జఫ్ఫాల విగ్రహాలు ఉండొచ్చు కానీ అందమైన బికినీ హంస స్టాచ్యూ పెడితే తప్పేముంది?