Begin typing your search above and press return to search.
హైదరాబాద్ రెస్టారెంట్ లో 'మిర్చీ' భామ!
By: Tupaki Desk | 7 Jan 2023 8:03 AM GMTవంశీ 'అనుమానాస్పదం' మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది హంసా నందిని. ఈ మూవీ తరువాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఐటమ్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రభాస్ నటించిన 'మిర్చి' మూవీతో 'మిర్చి మిర్చీ..' అంటూ రచ్చ చేసి పాపులర్ అయిన హంసా నందిని 2018 తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ఉన్నట్టుండి తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డానంటూ షాకిచ్చింది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న పలు ఫొటోలని పోస్ట్ చేసి అసలు విషయం బయటపెట్టింది.
దాదాపు ఏడాదిన్నర చికిత్స తీసుకున్న అనంతరం తను కోలుకుంది. చికిత్స జరుగుతున్న సమయంలో కీమో థెరపీ కారణంగా తన జుట్టంతా పోయిందని గుండుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. అప్పటి నుంచి పలుఏ వీడియోలు, ఫొటోలని ఫ్యాన్స్ తో పంచుకుంటూ తన ట్రీట్మెంట్ కి సంబంధించిన సమాచారం అందిస్తూ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి హంసా నందిని కోలుకోవడానికి తనకు 16 సైకిల్స్ కీమోథెరపీ చేశారట. ఏడాదిన్నర పాటు క్యాన్సర్ పై పోరాడిన హంసా నందిని ఎట్టకేలకు క్యాన్సర్ ని జయించింది.
రీసెంట్ గా ఓ సినిమాషూటింగ్ లో పాల్గొంటున్నానంటూ క్యారవాన్ నుంచి బయటికి వస్తున్న ఫోటోలు, వీడియోలని అభిమానులతో పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'ఐయామ్ బ్యాక్' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమెపై నెటిజన్స్ లు ప్రశంసలు కురిపిస్తూ స్వాగతం పలికారు. ఆల్ ద బెస్ట్ చెప్పారు. 18 ఏళ్ల క్రితం హంసా నందిని తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిందట. ఇప్పుడు అదే తనకు వంశ పారంపర్యంగా సంక్రమించిందని చెప్పుకొచ్చింది.
మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టానని, ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నానని వెల్లడించి ఆన్ లొకేషన్ వీడియోని షేర్ చేసిన హంసా నందిని చాలా రోజుల తరువాత హైదరాబాద్ వచ్చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫొటోని షేర్ చేసింది. ఓ రెస్టారెంట్ లో వున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. రెస్టారెంట్ వారు విషయం తెలిసి తనకు వెల్క్ బోర్డ్ పెట్టడం విశేషం. ప్రస్తుతం హంసా నందిని రెస్టారెంట్ లో కూర్చుని కొత్త హెయిర్ స్టైల్ తో చిరునవ్వులు చిందిస్తున్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.