Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ హీరోయిన్ కి క్యాన్స‌రా?

By:  Tupaki Desk   |   20 Dec 2021 6:25 AM GMT
ప్ర‌భాస్ హీరోయిన్ కి క్యాన్స‌రా?
X
ఇటీవ‌ల త‌న‌కు క్యాన్స‌ర్ అంటూ కింగ్ నాగార్జున హీరోయిన్ సొనాలి బింద్రే షాకిచ్చిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆమె త‌ను ఎంత న‌ర‌క‌యాత‌న‌ని అనుభ‌వించానో వెల్ల‌డిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న హెయిర్ క‌ట్ చేయించుకుని గుండుతో వున్న ఫొటోల‌ని పోస్ట్ చేయ‌డం ప‌లువురిని క‌ల‌చివేసింది.

ఆ త‌రువాత కూడా ఆమె కీమో థెర‌పీ వ‌ల్ల త‌ను ఎదుర్కొన్న విష‌యాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఆమె అభిమానులే కాకుండా స‌హ న‌టీన‌టులు భావోద్వేగానికి లోన‌య్యారు.

సోనాలి బింద్రే సంఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ప్రభాస్ హీరోయిన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. త‌న‌కు క్యాన్స‌ర్ అంటూ గుండుతో వున్న ఫొటోని షేర్‌ చేసి పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు హంసా నందిని. ప్ర‌భాస్ న‌టించిన `మిర్చి` చిత్రంలో `మిర్చి మిర్చి లాంటి కుర్రాడే` అంటూ ప్ర‌త్యేక గీతంలో మెరిసి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న హంసా నందిని త‌న‌కు క్యాన్స‌ర్ సోకింద‌ని, తాను రొమ్ము క్యాన్స‌ర్ గ్రేడ్ -3 తో బాధ‌ప‌డుతున్నాన‌ని సోష‌ల్ మీడ‌యా వేదిక‌గా వెల్లించింది.

అంతే కాకుండా చికిత్స‌లో భాగంగా తాను కీమో థెర‌పీ చేయించుకుంటున్నాన‌ని వెల్ల‌డించింది. దాని కార‌ణంగానే త‌న జుట్టుని కోల్పోయాన‌ని తెలుపుతూ హంసా నందిని పెట్టిన పోస్ట్ ప్ర‌తీ ఒక్క‌రినీ క‌దిలిస్తోంది. త‌న‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ సోకిన‌ట్టుగా నాలుగు నెల‌ల క్రిత‌మే గుర్తించాన‌ని, అనుమానం రావ‌డంతో వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని.. కొన్ని టెస్ట్ ల అనంత‌రం త‌న‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ వున్న‌ట్టుగా తేలింద‌ని హంసా నందిని త‌న పోస్ట్ లో స్ప‌ష్టం చేసింది.

కొన్నేళ్ల క్రితం క్యాన్స‌ర్ కార‌ణంగానే త‌న త‌ల్లి మృతి చెందింద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్న హంసా నందిని భావోద్వేగానికి లోనైంది. వంశీ `అనుమానాస్ప‌దం` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన హంసా నందిని ఆ త‌రువాత అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ప్ర‌భాస్ న‌టించిన `మిర్చి` చిత్రంలో ప్ర‌త్యేక సాంగ్ లో మెరిసింది.

ఆమె తెలుగులో న‌టించిన చివ‌రి చిత్రం `పంతం`. ప్ర‌స్తుతం పూణేలో నివాసం వుంటున్న హంసా నందిని త్వ‌ర‌లో క్యాన్స‌ర్ నుంచి కోలుకుని మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌ని అంతా కోరుకుంటున్నారు.