Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అప్పటినుంచే యమా హాటు!

By:  Tupaki Desk   |   7 Jun 2019 8:35 AM GMT
ఫోటో స్టొరీ: అప్పటినుంచే యమా హాటు!
X
హాట్ బ్యూటీ హంసా నందిని 'మిర్చి' సినిమా టైటిల్ సాంగ్ 'మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే'.. 'అత్తారింటికి దారేది' లో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి పాటల్లో టాప్ హీరోలైన ప్రభాస్.. పవన్ కళ్యాణ్ లాంటి వారితో ఆడిపాడి గ్లామర్ ఒలికించి ఇండీసెంట్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇండీసెంట్ ప్రేక్షకులు అనగానే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఇండీసెంటే.. కానీ పైకి మాత్రం చెప్పరు. ఇంతకీ ఇప్పుడు ఈ హంస పేరుతో మీరీ హింసకు ఎందుకు గురవ్వాల్సిన అవసరం ఏర్పడిందంటే సరిగ్గా ఇరవై గంటల క్రితం హంస తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. అదే రీజన్.

ఆ ఫోటోకు హంస ఇచ్చిన క్యాప్షన్ "నేనెందుకు ఫోటోలను అంతగా ప్రేమిస్తానంటే.. మనం మళ్ళీ తిరిగి తీసుకొనిరాలేని కొన్ని అద్భుతమైన క్షణాల్ని అవి తమలో బంధిస్తాయి. ఇది నేను నా మోడలింగ్ కెరీర్ ప్రారంభంలో తీయించుకున్న ఫోటో. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే నేను అప్పటికే నా ఫస్ట్ సినిమా సైన్ చేశాను. నోట్: ఎంతో సీరియస్ గా స్టైలింగ్ జరిగింది కదా # ఫ్లాష్ బ్యాక్ గురువారం # హంస కథలు".

ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే సరిగా జీరో సైజ్ లో ఉంది హంస. ఎంతో నాజూకుగా ఉన్న హంస పింక్ టాప్.. కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే పొడవున్న అందమైన పింక్ స్కర్ట్ ధరించింది. చేతులకు సిల్వర్ కలర్ గాజులు.. కాళ్ళకేమో హై హీల్స్.. మెడలో పొడవాటి దండ.. చెవులకు పెద్ద రింగులు ధరించింది. పెద్ద కొప్పు.. సగం జుట్టు వదిలేసి అదోరకమైన జంగ్లీ హెయిర్ స్టైల్ లో కనిపించింది. కాలి చెప్పులను సరి చేసుకుంటున్నట్టుగా పోజిచ్చింది. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ ఎంతో సెన్సువల్ గా ఉంది. ఇక నాభి అందాల సంగతి సరే సరి.

నెటిజనులు కూడా రెచ్చిపోయారు. "అప్పటినుంచే హాటా హంసా".. "సూపర్ సెక్సీ.. హాటీ".. "ఇన్స్టా గ్రామ్ కు మంట పెట్టింది".. "అదే డ్రెస్ ఇప్పుడేస్తే ఏమౌతుంది" లాంటి డిఫరెంట్ కామెంట్లు పెటారు. ఏదేమైనా ఫోటో మాత్రం కెవ్వు కేక కదా?