Begin typing your search above and press return to search.

ఓరల్ సెక్స్ చేశా, నేనో క్రిమినల్- దర్శకుడు

By:  Tupaki Desk   |   3 Feb 2016 9:39 AM GMT
ఓరల్ సెక్స్ చేశా, నేనో క్రిమినల్- దర్శకుడు
X
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓరల్ సెక్స్ చేశానని.. తాను ఓ క్రిమినల్ అని ఆయన వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కానికి పాల్పడ్డ వాళ్లందరూ నేరస్థులేనని.. సెక్షన్ 377 ప్రకారం ఓరల్ సెక్స్ కు పాల్పడిన తాను కూడా ఓ క్రిమినలే అని హన్సల్ అన్నారు. స్వలింగ సంపర్కుల అంశంలో ఢిల్లీ కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో హన్సల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 377 స్వలింగ సంపర్కులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని... ఒకవేళ చట్టం అమల్లోకి తెస్తే భారత్‌లో అత్యధికమంది ఆ సెక్షన్ ప్రకారం నేరస్థులవుతారని హన్సల్ మెహతా అన్నారు.

అత్యధికుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న 377 చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 2012లో షాహిద్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకొన్న హన్సల్ మెహత్.. స్వలింగ సంపర్కం కథాంశంగా ‘అలీగఢ్’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ కు సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం మీద హన్సల్ సహా చిత్ర బృందమంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐతే హన్సల్ తన సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా గొడవ చేస్తున్నాడని సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లాని విమర్శించగా.. ‘‘నిహ్లానిని పబ్లిసిటీ కోసం వాడుకోవడం కంటే నేను అండర్ వేర్లు అమ్ముకుని బతుకుతా’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు హన్సల్.