Begin typing your search above and press return to search.

ఒప్పించే సత్తా వుండాలే కానీ...

By:  Tupaki Desk   |   4 July 2015 10:30 PM GMT
ఒప్పించే సత్తా వుండాలే కానీ...
X
కాదేదీ కవితకి అనర్హం అన్నట్టు సినిమా కథకి కథ ఇలాగే ఉండాలన్న కొలతలు ఏవీ లేవు. వాస్తవ కథలైన, కల్పిత గాదలైన.. ఇలా ఎలాంటి కథలకైనా సినిమా రూపమివ్వొచ్చు. అయితే ఆ కథని ప్రేక్షకుల చేత ఒప్పించే సత్తా కథనంలో వుండాలి. ఈ సత్తా వుంటే వారికి సదా విజయం వరిస్తుంది. ప్రస్తుతం అదే నమ్మకంతో ఇద్దరు బాలీవుడ్ దర్శకులు సిద్ధమవుతున్నారు.

సాహిద్ సినిమాకి జాతీయ అవార్డ్ అందుకున్న హన్సల్ మెహతా సంజయ్ గాంధీ జీవితాన్ని వెండి తెరపై చూపించనున్నారు. వినోద్ మెహతా రచించిన 'ది సంజయ్ స్టొరీ' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందిరా గాంధీ జీవిత చరిత్రని సినిమాగా మలిచే ప్రయత్నం జరుగుతున్నా సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే 'ఎ వెడ్నెస్ డే', 'బేబీ' సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నీరజ్ పాండే 'టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ' పేరుతో ఓ సినిమాన్ని రూపొందించనున్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్డి నిర్మాణ అవసరాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషయాన్నే సినిమాలో సెటైరిక్ కామెడీగా చూపించనున్నారు. ప్రేమ కోసం తాజమహల్ కట్టేయలనుకున్న వారు ఇంటికోసం మరుగుదొడ్డిని కట్టుకోరెందుకు అని ఈ సినిమా ద్వారా ప్రశ్నిస్తారట.

సమాజాన్ని ప్రతిబింబించే కథలు రావడం మంచిదే. కానీ ముందు చెప్పుకున్నట్టు కథనంలో బలం పొతే బాక్సాఫీస్ దగ్గర నిలబడడం కష్టం.