Begin typing your search above and press return to search.
ఇక్కడ స్లమ్ గాళ్.. అక్కడ సెక్సీ గాళ్
By: Tupaki Desk | 31 July 2017 5:55 AM GMTచాలామంది హీరోయిన్లు ఎందుకోగాని ఏ రేంజు అందాలు దారబోసినా కూడా పెద్దగా స్టార్ హీరోయిన్స్ అయితే కాలేరు. వారిలో అందం అభినయం అన్నీ ఉన్నా కూడా.. పెద్ద పెద్ద సినిమాలు మాత్రం రావు. అలాంటి హీరోయిన్ల లిస్టును చూసుకుంటే.. అందులో ముందుగా హన్సిక పేరు మాత్రమే ఉంటుంది అనడంతో అతిశయోక్తి లేదులే.
యాపిల్ అందాల హన్సిక మొత్వాని తెలుగులో అప్పుడెప్పుడో చిన్నప్పుడు దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మస్కా కంత్రి వంటి సినిమాల్లో స్టార్లతో నటించినా కూడా ఎందుకో ఆమెకు బ్రేక్ రాక.. ఆ బొద్దు అందాలతో తమిళంలో సెటిల్ అయిపోయింది. తీరా మళ్లీ సన్నబడ్డాక అయినా తెలుగులో బ్రేక్ వస్తుందని అనుకుంటే.. ఇప్పుడు గౌతమ్ నంద ఆమెను నిరాశపరిచిందనే చెప్పాలి. ఈ సినిమాలో అమ్మడు హైదరాబాద్ లోని ఒక స్లమ్ ప్రాంతంలో ఉంటూ ఒక జ్యూయెలరీ స్టోరులో పనిచేసే అమ్మాయిగా కనిపించింది. ఇటు స్లమ్ గాళ్ లుక్స్ కాని అటు పాటల్లో ఈమె ఇచ్చే కిక్ కాని.. పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.
కట్ చేస్తే.. ఇక్కడ తెలుగుతెరపై స్లమ్ గాళ్ గా కనిపించిన హన్సిక ఇప్పుడు గౌతమ్ నంద సినిమాను మినిమం కూడా ప్రమోట్ చేయకుండా ఏం చేస్తోందంటారు? ఏముంది.. అక్కడ యురోప్ టూర్లో అమ్మడు బిజీగా ఉంది. సెక్సీ సెక్సీ బట్టల్లో తన గాళ్ ఫ్రెండ్స్ మరియు బాయ్ ఫ్రెండ్స్ తో కలసి క్రొయేషియా అంతా చుట్టేస్తోంది. తెరపై స్లమ్ గాళ్ గా.. సోషల్ మీడియాలో సెక్సీ గాళ్ గా ఈ స్లిమ్ గాళ్ హడావుడి బాగానే ఉంది కాని.. వాటి వలన కెరియర్ మాత్రం పెద్దగా దూసుకుపోతోంది లేదు. ప్చ్!!