Begin typing your search above and press return to search.
చూడగానే వావ్ అనిపించే ముద్దుగుమ్మ ఇప్పుడు వామ్మో అనేలా..!
By: Tupaki Desk | 26 Oct 2022 2:30 AM GMTదేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ హన్సిక ఈ మధ్య కాలంలో తెలుగు లో కంటే తమిళం లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు అక్కడ నటించిన కొన్ని సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అవుతూ ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
తాజాగా హన్సిక గార్డియన్ అనే సినిమా లో నటిస్తోంది. విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో హన్సిక ను చూసి ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు. దేశ ముదురు సినిమా విడుదల అయినప్పటి నుండి ఈ అమ్మడు రోజు రోజుకు అందం మరింతగా పెరుగుతుందా అన్నట్లుగా అందంగా కనిపిస్తూ వచ్చింది.
చూసిన ప్రతి సారి కూడా ప్రతి ఒక్కరితో వావ్ అనిపించుకున్న ముద్దుగుమ్మ హన్సిక ఇప్పుడు తాజా గార్డియన్ లుక్ లో మాత్రం వామ్మో అనే విధంగా ఉంది. ఘోస్ట్ లుక్ లో గార్డియన్ ఫస్ట్ లుక్ లో చూసిన హన్సిక ను జనాలు మర్చి పోలేక పోతున్నారు. భయంతో బాబోయ్ అంటున్నారు.
అందంగా ఉండే హన్సిక అలా కనిపించే పాత్రలు చేయకుండా ఇలా దెయ్యం పాత్రలు ఎందుకు అంటూ అభిమానులు కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈమె ప్రయత్నంను అభినందిస్తున్నారు.
గ్లామర్ పాత్రలకు ఎంతగా సెట్ అయ్యిందో హర్రర్ పాత్రలకు కూడా అంతగా హన్సిక సెట్ అవుతుందని ఈ ఫోటో ను చూస్తుంటే అనిపిస్తుందని కొందరు అంటున్నారు. మొత్తానికి గార్డియన్ ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉంది అనడం లో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.