Begin typing your search above and press return to search.

తెలుగు ఇండస్ట్రీపై ఈ హీరోయిన్‌ కు ఎంత ప్రేమో!

By:  Tupaki Desk   |   24 May 2015 5:50 AM GMT
తెలుగు ఇండస్ట్రీపై ఈ హీరోయిన్‌ కు ఎంత ప్రేమో!
X
తమిళులు తనకు గుడి కట్టి ఆరాధిస్తున్నా.. తెలుగు సినిమా అంటేనే తనకు చాలా ఇష్టమని అంటోంది హన్సిక. అది మామూలు ఇష్టం కాదట.. ఒక తెలుగు సినిమా, మరో తమిళ సినిమా ఆఫర్లు ఒకేసారిగా వస్తే.. తను తెలుగు సినిమానే ఎంచుకొంటానని ఆమె అంటోంది. ప్రస్తుతానికి తమిళంలో కెరీర్‌ బ్రహ్మాండంగా దూసుకుపోతున్నా.. హన్సిక మాత్రం తెలుగు సినిమాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తానంటోంది!

ఇలా ప్రాధాన్యతను ఇవ్వడమే తను తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఇచ్చే గౌరవానికి ప్రతీక అని ఆమె చెప్పుకొంటోంది. మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్లవైపు మొగ్గుచూపాల్సిన ఇండస్ట్రీలో ఉంటూ ఇలాంటి అభిమానం ఎందుకు? అంటే.. దానికీ హన్సిక వద్ద సమాధానం ఉంది.

తనకు తొలుత అవకాశం ఇచ్చింది ఆంధ్రులే కాబట్టి.. ఆమెకు తెలుగు ఇండస్ట్రీపై అంత మమకారం ఉంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న గుర్తింపుతో టీనేజ్‌కి వచ్చాకా హీరోయిన్‌గా ట్రయల్స్‌ వేస్తున్న సమయంలో హన్సికకు టాలీవుడ్‌లోనే తొలి అవకాశం వచ్చింది. అక్కడ నుంచి ఆమె టైమ్‌ స్టార్ట్‌ అయ్యింది. అందుకే హన్సిక తెలుగు ఇండస్ట్రీని ఇంతగా అభిమానిస్తోందట. తమిళ సినిమాలను కాదనుకొని అయినా.. తెలుగు సినిమాలకు ఓకే చెబుతానంటోంది. మరి హన్సికకు టాలీవుడ్‌పై ఉన్న అభిమానాన్ని ఇక్కడి దర్శక, నిర్మాతలు అర్థం చేసుకొంటారా మరి?!