Begin typing your search above and press return to search.

ఈ తిప్పలన్నీ అవకాశాలకోసమేనట!

By:  Tupaki Desk   |   23 Dec 2018 8:14 AM GMT
ఈ తిప్పలన్నీ అవకాశాలకోసమేనట!
X
స్టార్ హీరోలు లేదా స్టార్ డైరెక్టర్లు లేని ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి పబ్లిసిటీ ఒక్కటే మార్గం. పబ్లిసిటీ అనగానే ఏదో పోస్టర్లు రిలీజ్ చేసి అన్ని మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఊదరగొడితే సరిపోదు. ఎవ్వరూ పట్టించుకోరు. అదే ప్రమోషన్స్ వినూత్నంగానైనా ఉండాలి లేదా ఏదో ఒక వివాదాన్నైనా రాజెయ్యాలి. అప్పుడే అందరి దృష్టి ఆ సినిమాపైన పడుతుంది. ఈ తరం ఫిలిం మేకర్లు ఈ విషయాన్ని బాగానే ఒంటబట్టించుకున్నారు.

తమిళంలో హన్సిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'మహా' సినిమా మేకర్లు సరిగ్గా ఇదే రూట్ ఫాలో అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో హన్సిక ఒక సాధువు దుస్తులు ధరించి హుక్కా పీలుస్తుండడం.. ఆమె ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉంటే ఇతర సాధువులు కింద కూర్చొని ఉండడం వివాదానికి దారి తీసింది. ఇప్పటికే ఈ పోస్టర్ పై పలు కేసులు రిజిస్టర్ అయ్యాయి. హన్సిక... దర్శకుడు జమీల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల వారు కోరుతుకున్నారు. బీజెపీ ఎంఎల్ఎ రాజాసింగ్ ఈ విషయంలో 'మహా' ఫిలిం మేకర్స్ ను ఇలాంటి పనులు చేస్తే మేం చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు.

పోస్టర్ వివాదం పై స్పందించిన హన్సిక అందంత పెద్ద విషయం కాదని సినిమాలో ఇలాంటివి ఇంకా ఉన్నాయని జవాబిచ్చింది. హన్సిక రెస్పాన్స్ ఈ వివాదాన్ని మరింత పెంచేదిలా ఉంది. ఇదిలా ఉంటే మరో హీరోయిన్ అమలా పాల్ రీసెంట్ గా పొగ తాగుతూ ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. కొందరు ఈ స్మోకింగ్ ఫోటో షూట్ పై పాజిటివ్ గా స్పందించినా మిగతా వారు మాత్రం తిట్టిపోస్తున్నారు. ఈ హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోవడంతో ఇలాంటి వివాదాలు సృష్టించి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అవకాశాల కోసం ఎంతకు దిగజారేందుకైనా ఈ హీరోయిన్లు వెనకాడడం లేదని విమర్శిస్తున్నారు.