Begin typing your search above and press return to search.
అయ్యో.. వరదలో మునిగిన హీరోయిన్
By: Tupaki Desk | 25 Nov 2015 4:59 AM GMTపాలబుగ్గల హన్సిక ప్రస్తుతం తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ సరసన జాలీ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబై పరిసరాల్లో సాగుతోందిప్పుడు. అయితే ప్రస్తుతం అక్కడ ఊహించని విధంగా వరదలు ముంచెత్తుతున్నాయి. నగరం అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. నిన్నటి రేయి హనీ ఊహించని సన్నివేశాన్ని ఎదుర్కొంది. ఒక రేయంతా వరద నీటిలో స్టక్ అయిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో కనీసం గంట పాటు సుదీర్ఘంగా నడక సాగించాల్సొచ్చిందంటే అర్థం చేసుకోవాలి.
ఈ అమ్మడు షూటింగ్ ముగించుకుని రాత్రి వేళ తన కార్ లో వ్యక్తిగత సిబ్బందితో పాటు తిరుగు పయనం అయ్యింది. అయితే మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల కొద్దీ కార్ లన్నీ ఆగిపోయాయి. మధ్యలో హనీ కార్ కూడా చిక్కుకుపోయింది. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా తయారైంది పరిస్థితి. దాంతో ఆ క్షణం ఏం చేయాలో పాలుపోని హనీ కాసేపు ఫోన్ లో తనవారికి, ప్రొడక్షన్ టీమ్ కి కాల్ చేయాలని ప్రయత్నించింది. కానీ అసలు సిగ్నల్ అన్నదే కనెక్టవ్వలేదు. పైగా కార్ దిగి ఎటైనా నడిచి వెళ్లిపోదామంటే మోకాళ్ల లోతు నీటిలో దిగాల్సిన పరిస్థితి. దాంతో కాసేపు కార్ లోనే టీవీ చూస్తూ కూచుంది. మిడ్ నైట్ 12 గంటల వరకూ ఇదే సన్నివేశం. తనకి దూరంగా ఉన్న పార్క్ హయత్ లో రూమ్ కేటాయించారు. అక్కడికి వెళ్లడం ఆ రేయి ఇక కుదరని పని. దాంతో ఏదోలా రోడ్డుపై నడుచుకుంటూ వేరొక హోటల్ కి వెళ్లాలనుకుని కార్ దిగింది.
మోకాళ్ల లోతు నీరు. .కనీసం గంట సేపు నడక.. ఎలాగోలా వ్యక్తిగత స్టాఫ్ తో కలిసి ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ కి చేరుకుంది. అక్కడ బాత్రూమ్ షవర్ కింద స్నానం చేసేప్పుడు .. ఓ సారి గతాన్ని గుర్తు చేసుకుంది. 26/7 .. 2005 ... అప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్. తను ముంబై వరదల్లో చిక్కుకుపోయింది. అయితే ఆ సన్నివేశంలో తను తన స్నేహితురాలితో కలిసి ఉంది. కానీ ఇప్పుడు పర్సనల్ సిబ్బందితో మాత్రమే ఉంది. అదీ మ్యాటరు!