Begin typing your search above and press return to search.

మాజీ ప్రేమికులు తాజాగా కలవబోతున్నారా...?

By:  Tupaki Desk   |   17 April 2020 11:30 PM GMT
మాజీ ప్రేమికులు తాజాగా కలవబోతున్నారా...?
X
బబ్లీ బ్యూటీ హన్సిక - రొమాంటిక్ హీరో శింబు ఇద్దరూ మాజీ ప్రేమికులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఒకానొక టైములో వీరి ప్రేమాయణం సౌత్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్. ఒక దశలో వీళ్ల ఎఫైర్ పెళ్లి వరకు వెళ్లింది. కానీ సరిగ్గా అదే సమయానికి వీరిద్దరి మధ్య ఏమి జరిగిందో ఏమో కానీ విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. దాంతో శింబు - హన్సిక ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు ఏర్పడ్డాయి. కొన్ని రోజులు తర్వాత శింబు నయన్ తో జత కట్టడం.. వాళ్ళిద్దరి లవ్ బ్రేక్ అయి నయన్ ప్రభుదేవాతో జత కట్టడం.. అన్నీ జరిగిపోయాయి. కట్ చేస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు శింబుతో కలిసి ఓ సినిమా చేస్తోంది హన్సిక. అందులో శింబుది గెస్ట్ రోలే అయినప్పటికీ అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఒకప్పుడు శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ బొద్దుగుమ్మ.. ఇప్పుడు అతడు ఓ మంచి స్నేహితుడు మాత్రమే అంటోంది. వివరాల్లోకి వెళ్తే లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన హన్సిక.. తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఎక్కువ మంది శింబు గురించే ప్రశ్నించారు. మళ్లీ ప్రేమ మొదలైందా అంటూ ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. చాట్ సెషన్ ప్రారంభంలో అలాంటి ప్రశ్నల్ని స్కిప్ చేసిన హన్సిక.. వరుసగా శింబు గురించే అడిగేటప్పటికి ఇక రియాక్ట్ అవ్వక తప్పలేదు. ప్రేమికులుగా విడిపోతే ఫ్రెండ్స్ గా కలిసి ఉండకూడదా అంటూ కాస్త సీరియస్ గానే రివర్స్ అయిందట.

అయితే ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వమని శింబు ని దర్శకుడి చేత హన్సికే అడిగించిందట. మాజీ ప్రేయసి స్వయంగా ఓ దర్శకుడ్ని పంపడంతో శింబు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాదు లొకేషన్ లో ఇద్దరి మధ్య మళ్ళీ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుండటంతో శింబు ని హన్సిక మళ్ళీ ప్రేమిస్తోంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లోకి వచ్చిన హన్సికని వెంటనే అంతా శింబు గురించే అడగడం మొదలుపెట్టారట. ఏదేమైనా ఈ మాజీ ప్రేమికులు తాజాగా మళ్ళీ జోడీ కడతారేమో చూడాలి.