Begin typing your search above and press return to search.

అప్పుడు హీరోయిన్ ఇప్పుడు విలనా ?

By:  Tupaki Desk   |   24 April 2019 6:31 AM GMT
అప్పుడు హీరోయిన్ ఇప్పుడు విలనా ?
X
సరిగ్గా 12 ఏళ్ళ క్రితం వచ్చిన దేశముదురు సినిమా గుర్తుందా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మ్యూజికల్ గానూ కమర్షియల్ గానూ పెద్ద బ్లాక్ బస్టర్. దీంతోనే యాపిల్ బ్యూటీగా హన్సిక మనకు దగ్గరయింది. ఆ తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి కానీ తెలుగులో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక తమిళ్ లో ఏకంగా గుళ్ళు కట్టించుకునే రేంజ్ లో పాపులర్ అయిపోయింది.

ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్న హన్సిక ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్బిలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ మూవీలో హన్సికకు ఓ స్పెషల్ రోల్ ఆఫర్ చేసినట్టుగా టాక్

అయితే ఇది ఆషామాషీ రోల్ కాదంట. నెగటివ్ షేడ్స్ తో ఉంటూ పెర్ఫార్మన్స్ కు చాలా స్కోప్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర అని తెలిసింది. హన్సికకు తమిళ్ లో డిమాండ్ బాగానే ఉంది. ఇక్కడ ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే ఇంకో మూవీలో విలన్ తరహా పాత్ర చేస్తుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది.

ఒకపుడు సన్యాసినిగా పరిచయమై హీరో ప్రేమలో పడే సుందరిగా హన్సిక చేసిన అల్లరి టివిలో వచ్చిన ప్రతిసారి మెప్పిస్తునే ఉంది. మరి అదే హీరోకు ఆపోజిట్ గా కనిపించడం అంటే విశేషమే. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ ఇంకా రావాల్సి ఉంది. ప్రచారమైతే జోరుగా సాగుతోంది