Begin typing your search above and press return to search.

బొద్దుగుమ్మ వార్నింగ్ ఇస్తోందే

By:  Tupaki Desk   |   11 Dec 2016 5:48 PM GMT
బొద్దుగుమ్మ వార్నింగ్ ఇస్తోందే
X
టాలీవుడ్ తో మొదలుపెట్టినా ఇక్కడ అంతగా ఫేమ్ సంపాదించుకోలేకపోయిన హన్సిక మొత్వాని.. కోలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. మరి ఆ స్థాయి వచ్చిందంటే.. ఆటోమేటిగ్గా రకరకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో ఇలాంటివి బాగా కామన్ అయిపోయాయి.

ఇప్పటికే ఓసారి హన్సిక సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ కాగా.. తిరిగి దాన్నుంచి బయటపడింది. ఇప్పుడు ఓ ఫేక్ అకౌంట్ ను ఓపెన్ చేసి ఆమెను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. దీంతో ఓపిక పట్టలేకపోయిన ఈ బొద్దుగుమ్మ.. తన అభిమానులను ఈ విషయంలో హెచ్చరించింది. ఆ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా తీసి పోస్ట్ చేసిన ఈ భామ.. 'ఇది ఫేక్ అకౌంట్. ఇది నాది కాదు బాబోయ్.. దయ చేసి యాడ్ చేసుకోకండి' అంటూ అభిమానులకు ఉపదేశాలు ఇచ్చింది.

అయితే.. ఈ విషయంలో అభిమానులేమీ తక్కువ తినలేదు. చాలామంది వెంటవెంటనే రియాక్ట్ అయిపోయారు. ఈ విషయంలో రిపోర్టులు చేసేస్తాం అని కొందరు వీరాభిమానులు చెబితే.. 'బ్లూ టిక్ ఉంటేనే ఒరిజినల్ మాకు తెలుసులే హన్సికా' అంటూ ఆన్సర్స్ ఇచ్చారు. పాపం తన ఫ్యాన్స్ ని హన్సిక అండర్ ఎస్టిమేట్ చేసినట్లుంది కదూ.