Begin typing your search above and press return to search.
శర్వా సినిమాకు హను మినీ రివ్యూ ఇచ్చేశాడు!
By: Tupaki Desk | 8 Sep 2022 11:43 AM GMTదుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన ఎపిక్ లవ్ స్టోరీ `సీతారామం`. ఈ మూవీతో ప్రేక్షకుల, సెలబ్రిటీల ప్రశంసలతో పాటు భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు హను రాఘవపూడి. తనదైన స్టైల్ కు పూర్తి భిన్నంగా ఓ దృశ్యకావ్యంలా `సీతారామం`ని తెరకెక్కించి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు. త్వరలో కొత్త తరహా సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న హను రాఘవపూడి తాజాగా శర్వానంద్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఒక విధంగా చెప్పాలంటే మినీ రివ్యూ ఇచ్చేశారు. వివరాల్లోకి వెళితే. శర్వానంద్ నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ ఫిక్షన్ మూవీ `ఒకే ఒక జీవితం`. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు అందించిన ఈ మూవీని శ్రీ కార్తీక్ రూపొందించాడు. అమల అక్కినేని కీలక పాత్రలో నటించగా, రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షోని ప్రదర్శించారు.
సినిమా చూసిన కింగ్ నాగార్జున ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. `ఒకే ఒక జీవితం భావోద్వేగభరితమైన చిత్రమని, అందంగా తీర్చిదిద్దారని, తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవన్నారు. అంతే కాకుండా సినిమా చూస్తున్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదని, మా అమ్మ, ఆమె ప్రేమ గుర్తొచ్చిందన్నారు.
అయితే దర్శకుడు హను రాఘవపూడి మాత్రం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే మినీ రివ్యూ ఇవ్వడం విశేషం. ఒకే ఒక జీవితం సినిమా చూసే ఛాన్స్ వచ్చింది. అమలగారు, ప్రియదర్శీ, వెన్నెల కిషోర్, అలాగే పిల్లలు.. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. దర్శకుడు శ్రీకార్తీక్ తన బాధ్యతని అత్యద్భుతంగా నిర్వర్తించాడు. ఇక బ్రదర్ శర్వానంద్ తన పాత్రతో చంపేశాడు. ఇది శర్వా అత్యుత్తమమైన నటన.
సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇలాంటి కథల గురించి చెప్పాలంటే అందుకు తగ్గ సౌండ్ డిజైనింగ్ కావాలి దీనికి అత్యుత్తమమైన సౌండ్ డిజైనింగ్ కుదిరింది. ఈ మధ్య కాలంలో నేను చూసిన అత్యంత మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు ప్రేమిస్తారని నా గట్టి నమ్మకం. టీమ్ అందరికి శుభాకాంక్షలు` అని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు హను రాఘవపూడి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.