Begin typing your search above and press return to search.
'హను-మాన్' టీజర్: ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో వచ్చేసాడు..!
By: Tupaki Desk | 21 Nov 2022 7:59 AM GMTక్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం "హను-మాన్". కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్లలో సినిమాలు రూపొందిస్తూ వస్తోన్న దర్శకుడు.. ఇప్పుడు సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టించాడు. 'జాంబీ రెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత 'హను-మాన్' మల్టీవర్స్ లో భాగంగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన "హను-మాన్" టైటిల్ టీజర్ - ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్.. ఇతర ప్రధాన పాత్రల క్యారక్టర్ పోస్టర్లు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా టీజర్ ని మేకర్స్ ఆవిష్కరించారు. ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ని చూపిస్తూ.. చేతిలో గదతో నిలబడి ఉన్న భారీ హనుమాన్ విగ్రహాన్ని చూపించడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. బ్యాగ్రౌండ్ లో భక్తి పారవశ్యాన్ని కలిగిస్తూ.. రాముడి పరమ భక్తుడైన హనుమంతుడి గురించిన కీర్తనను మనం వినవచ్చు.
తేజ సజ్జా సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కథానాయిక అమృత అయ్యర్ ను ఒక వింత ముఖం తరమడాన్ని చూడొచ్చు. సూర్యగ్రహణం సంకేతంగా విలన్ ఎంట్రీని సూచిస్తూ.. 'మ్యాన్ ఆఫ్ డూమ్' గా వినయ్ రాయ్ ను భయంకరంగా ప్రెజెంట్ చేసారు. అలానే పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరికాయలతో విలన్లపై ఫైట్ చేస్తూ ఇంటెన్స్ గా కనిపించింది.
సాధారణ యువకుడైన హనుమంతు కొన్ని అతీంద్రియ శక్తులతో సూపర్ హీరోగా మారినట్లు తెలుస్తోంది. చేతిలో గద పట్టుకొని నిలబడం.. ఆకాశంలో ఎగురుతూ తన అత్యున్నత శక్తులను చూపించడాన్ని బట్టి.. అతను హనుమాన్ ఆధీనంలో ఉన్నట్లు కనిపిస్తోంది. హనుమాన్ తపస్సు చేస్తూ, రామ నామాన్ని జపిస్తున్న చివరి విజువల్స్ తో ఈ టీజర్ ముగుస్తుంది.
ప్రశాంత్ వర్మ మరోసారి ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచే సినిమాతో రాబోతున్నట్లు 'హను మాన్' టీజర్ హామీ ఇచ్చింది. ప్రతి ఫ్రేమ్ లోనూ అతని టీమ్ మాస్టర్ వర్క్ కనిపిస్తుంది. ఈ చిన్న వీడియోతో అందరినీ తాను సృష్టించిన అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాశరధి శివేంద్ర తన అద్భుతమైన కెమెరా వర్క్ తో ఆకట్టుకోగా.. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.
ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగళ ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పాలి. ఎస్బీ రాజు తలారి దీనికి ఎడిటింగ్ చేసారు. టీజర్ లో VFX వర్క్ సన్నివేశాలను కొత్త స్థాయికి ఎలివేట్ చేసేలా.. టాప్-నాచ్ క్వాలిటీతో ఉన్నాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. తేజ సజ్జ సూపర్ హీరో హనుమాన్ గా ఆకట్టుకున్నాడు. మొత్తం మీద 'హను మాన్' టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.
చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో గెటప్ శ్రీను - సత్య - రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
"హను-మాన్" చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ మరియు కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.