Begin typing your search above and press return to search.
ఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు
By: Tupaki Desk | 9 Aug 2022 8:33 AM GMTతమిళ్ లో ధనుష్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగు లో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయిన అసురన్ తెలుగు రీమేక్ నారప్ప కి మంచి టాక్ దక్కింది. థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే భారీగా వసూళ్లు నమోదు అయ్యేవి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. నారప్ప కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. అయితే ఈ రీమేక్ ఆఫర్ మొదట హను రాఘవపూడి వద్దకు వెళ్లిందట.
నిర్మాతలు అసురన్ ను తెలుగు లో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయాలంటూ హను రాఘవపూడి వద్దకు వెళ్లిన సమయంలో ఆయన సున్నితంగా తిరష్కరించాడు.
అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. ఆఫర్లు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో హను రాఘవపూడి అంత మంచి ఆఫర్ ను తిరష్కరించాడు.. హను ఏమైనా తెలివి తక్కువ వాడా అంటూ కొందరు ట్రోల్స్ కూడా చేశారు.
నారప్ప సినిమా ను తిరస్కరించడానికి కారణం పై ఇన్నాళ్లు నోరు విప్పని దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. తన సీతారామం సినిమా మంచి టాక్ తో క్లాసిక్ మూవీ అనిపించుకుంటున్న సమయంలో నారప్ప విషయమై స్పందించాడు. నారప్ప సినిమా ను చేసేందుకు నాకు దర్శకుడిపై అభిమానం అడ్డు వచ్చిందని హను రాఘవపూడి పేర్కొన్నాడు.
ఆయన మాట్లాడుతూ... తాను తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు పెద్ద అభిమానిని. ఆయన దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నై వెళ్లి మరీ చూస్తాను. ఆయన దర్శకత్వంలో వచ్చిన అసురన్ సినిమా అంటే నాకు ఇష్టం. అలాంటి సినిమా ను రీమేక్ చేయాలంటే నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. నా అభిమాన దర్శకుడి సినిమాను రీమేక్ చేయలేను అని చెప్పాను అన్నాడు.
సీతారామం సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాలు కష్టపడ్డ దర్శకుడు హను రాఘవపూడి ఇప్పుడు రిలాక్స్ అయ్యాడు. ప్రేమ కథలను అద్భుతంగా చూపించడం లో మణిరత్నం తర్వాత హను రాఘవపూడి అన్నట్లుగా ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. కనుక ముందు ముందు కచ్చితంగా హను నుండి గొప్ప ప్రేమ కథలు వస్తాయని అంతా నమ్మకంగా ఉన్నారు.