Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కి 'లై' కథ చెప్పాను .. ఆయనంటే నాకు పిచ్చి!
By: Tupaki Desk | 4 Aug 2022 5:30 PM GMTహను రాఘవపూడి పేరు వినగానే 'అందాల రాక్షసి' సినిమా గుర్తుకు వస్తుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లోని సహజత్వం కనులముందు కదలాడుతుంది. 'లై' .. 'పడి పడి లేచే మనసు' సినిమాలతో రెండు ఫ్లాపులు ఇచ్చిన ఆయన, ఈ సారి మాత్రం తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో 'సీతా రామం' సినిమాను రూపొందించాడు. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో హను రాఘవపూడి బిజీగా ఉన్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "గతంలో నేను ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. నిజమే అప్పట్లో ఆయనతో ఒక సినిమా చేద్దామనే అనుకున్నాను. నాకు బ్రహ్మానందంగారితో మంచి సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఆయనకి చాలా అభిమానం. 'ప్రయాణం' సినిమా సమయంలో నేను ఆయనను ఫస్టు టైమ్ కలవడం జరిగింది. ఆయనే నా దగ్గరున్న కథను గురించి విని .. నన్ను ఎన్టీఆర్ దగ్గరికి పంపించారు. అప్పట్లో ఎన్టీఆర్ మెహాదీపట్నంలో ఉండేవారు. నేను వెళ్లి ఎన్టీఆర్ గారిని కలిశాను.
కథ చెప్పడానికి నాకు పావుగంట మాత్రమే టైమ్ ఇచ్చారు. ఆ తరువాత నేను కథ చెప్పే తీరు నచ్చిందంటూ మూడు .. నాలుగు గంటల సేపు విన్నారు. అప్పటికే ఆయన స్టార్ హీరో. అందువలన కథల విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి.
ఆ కారణంగా ఆయనతో ఆ సినిమా చేయడం కుదరలేదు. నేను ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలను మొదటి రోజే చూసేస్తూ ఉంటాను. ఆయనంటే నాకు అంత పిచ్చి .. 'ఆది' సినిమా చూసినప్పటి నుంచి అలా మారిపోయానంతే. ఆయనకి నా కథలు అంటే ఇష్టం .. నేను ఎక్కడ కనిపించినా ఎంతో అభిమానంతో పలకరిస్తూ ఉంటారు.
ఎన్టీఆర్ తో ఉన్న పరిచయం కారణంగా 'లై' కథను ఆయనకి చెప్పడం జరిగింది .. అంతేగానీ ఆయన తో చేయాలని కాదు. ఎన్టీఆర్ ఇప్పుడు నాతో చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ , ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ కి ఆయనను హ్యాండిల్ చేయగలనో లేదో కూడా నాకు తెలియదు.
నేను చేయగలను అనే నమ్మకం ఆయనకి కుదిరినప్పుడు ఆలోచన చేయాలి. 'అందాల రాక్షసి' సినిమా విషయానికి వస్తే, ఆ కథను ముందుగా నానితో చెప్పాను. అప్పుడు ఆయన 'ఈగ' సినిమాతో బిజీగా ఉండటం వలన కుదరలేదు. ఇప్పుడు నానీ కోసం మరో కథను రెడీ చేశాను. త్వరలో మా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.