Begin typing your search above and press return to search.

బడా ప్రొడక్షన్ తో సీతారామం దర్శకుడు

By:  Tupaki Desk   |   2 March 2023 1:00 PM GMT
బడా ప్రొడక్షన్ తో సీతారామం దర్శకుడు
X
సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి క్లాసిక్ హిట్ అందించిన టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి తరువాత క్రిష్ణగాడి వీరప్రేమకథ సినిమాతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టాడు.

ఇక మూడో తర్వాత లై అనే సినిమాని నితిన్ తో చేశాడు. ఈ మూవీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ప్రేక్షకులకి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. తరువాత మరల తనకి అలవాటైన లవ్ స్టొరీలోకి వచ్చి పడిపడి లేచే మనసు మూవీ చేశాడు.

ఈ మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ హిట్ కాలేదు. అయితే దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సీతారామం సినిమా చేశాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చూసిన అనుభూతిని ప్రతి ఒక్కరు తెలియజేశారు. ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లాసిక్ చిత్రాల సరసన ఈ మూవీ కూడా నిలుస్తుంది అనే మాట విమర్శకుల నుంచి వినిపిస్తుంది.

ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషలలో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి కచ్చితంగా నేషనల్ అవార్డులు సైతం వస్తాయని సినీ విశ్లేషకులు తెలియజేశారు. ఇక ఈ మూవీ తర్వాత పీరియాడిక్ జోనర్ లో ఒక ప్రేమ కథని తెరకెక్కిస్తా అని హనురాఘవపూడి తెలిపాడు.

అలాగే వైజయంతీ మూవీలో హను ఒక సినిమా చేస్తాడని వారు కూడా ప్రకటించారు. ఇక మృణాల్, దుల్కర్ కాంబినేషన్ లోనే ఆ సినిమా ఉంటుందని కూడా చెప్పారు.

అయితే ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే ఛాన్స్ అయితే లేదు. ఇదిలా ఉంటే ఈ దర్శకుడు ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లోనే ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ కూడా దర్శకుడు చెప్పడం జరిగిందని టాక్. త్వరలో దీనికి సంబందించిన క్యాస్టింగ్ కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.