Begin typing your search above and press return to search.

రిలీజ్ ముంగిట.. కొడుకు పుట్టాడు

By:  Tupaki Desk   |   9 Aug 2017 1:42 PM GMT
రిలీజ్ ముంగిట.. కొడుకు పుట్టాడు
X
టాలీవుడ్ యువ దర్శకుడు హను రాఘవపూడి.. తన కెరీర్లో అత్యంత కీలకమైన ‘లై’ సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఆ సినిమా అతడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఏమో కానీ.. ఈలోపు హనును సంతోషంలో ముంచెత్తే పరిణామం జరిగింది. అతడికి కొడుకు పుట్టాడు. హను భార్య అమూల్య బుధవారం హైదరాబాద్ లో మగబిడ్డకు జన్మనిచ్చింది.

‘లై’ సినిమా మొదలవడానికి కొన్ని నెలల ముందే హనుకు అమూల్యతో పెళ్లయింది. ఆమె డాక్టర్ కావడం విశేషం. ‘లై’ సినిమా మొదలయ్యాక అమూల్య ప్రెగ్నెంట్ అయింది. అలాంటి సమయంలో సినిమా కోసం హను భార్యను విడిచి పెట్టి నెలల తరబడి బయటే ఉన్నాడంటూ ‘లై’ ఆడియో వేడుకలో నితిన్ చెప్పిన సంగతి తెలిసిందే. ‘లై’ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

ఈ అంచనాల్ని అందుకుని సినిమా హిట్టయితే హను ఆనందం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు. ‘లై’ తర్వాత హను నానితో ఒక సినిమా కమిటయ్యాడు. వీళ్లిద్దరూ గత ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చేసిన సంగతి తెలిసిందే. ఐతే నాని సినిమా మొదలవడానికి ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈలోపు మరో హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు హను.