Begin typing your search above and press return to search.

డిజార్డర్ ఉన్నదెవరికి రాఘవా?

By:  Tupaki Desk   |   3 Jan 2019 4:54 AM GMT
డిజార్డర్ ఉన్నదెవరికి రాఘవా?
X
కొందరు దర్శకులు తమ పరాజయాన్ని అంత తేలిగ్గా ఒప్పుకోరు. వేరే కారణాలు వెతుకుతూ వాటి వల్లే సినిమా ఫెయిలయ్యింది అంటారే తప్ప తమ తప్పేమి లేదన్నట్టు మాట్లాడతారు. పడి పడి లేచే మనసుతో మరో సూపర్ ప్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న హను రాఘవపూడి కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేయడం గమనార్హం. గతంతో పోలిస్తే ప్రేక్షకుల్లో ఇటీవలి కాలంలో అటెన్షన్ డిజార్డర్ ఎక్కువయ్యిందని అందుకే అవసరానికి మించి విశ్లేషణలు చేస్తున్నారని చెప్పాడు. అంటే ఒకప్పుడు ఆసక్తితో విన్న కథలను ఇప్పుడు వేరే ఉద్దేశాలతో చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇదీ మరీ చోద్యంగా ఉంది.

ప్రేక్షకుడు రెండు వందలు ఖర్చు పెట్టి సినిమాకు వచ్చాడు అంటే తాను వెచ్చించిన సొమ్ము సమయానికి న్యాయం జరగాలనే. అంతే తప్ప దర్శకుడు ఎలా తీసాడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని పోస్ట్ మార్టం చేయడానికి కాదు. వృత్తి పరంగా విశ్లేషణలు చేసేవాళ్ళు ఉన్నా ఆ సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో హను రాఘవపూడి కామెంట్స్ కాస్త ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. అయినా ప్రతిదీ ప్రేక్షకులు అలా భూతద్దంలో పెట్టి చూస్తే ఏ సినిమా ఆడదు. ఎంటర్ టైన్ మెంట్ దొరికిందా లేదా అని చూస్తాడు తప్ప వాళ్లకు మరో ఉద్దేశం ఉండదు.

మరి టికెట్ కొనే ప్రేక్షకుడికే డిజార్డర్ ఉంటుందన్న రాఘవ అసలు ఆ సమస్య ఉన్నదెవరికో గుర్తిస్తే మంచిది. మణిరత్నం తరహాలో టేకింగ్ ఉంటుందన్న కామెంట్ ను పరిగణనలోకి తీసుకున్న హను రాఘవపూడి పడి పడి లేచే మనసు నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం కోల్ కతాలో వాతావరణమే అంటున్నాడు. మరి నితిన్ లైకి నాని కృష్ణగాడి వీర ప్రేమ గాధకు కూడా ఇదే జరిగింది కదా. ఏదైతేనేం పడి పడి లేచే మనసు హనుకి పాఠాలు నేర్పిందో లేదో వచ్చే సినిమాకు గాని క్లారిటీ రాదు