Begin typing your search above and press return to search.
ఆ రెండు ఫ్లాపుల వెనకున్న కారణాలు కనిపెట్టేశా!
By: Tupaki Desk | 5 Aug 2022 4:18 AM GMTసినిమాకి హిట్ ఫార్ములా అనేది లేదు .. అది తెలిస్తే అందరూ హిట్ సినిమాలే చేసేవారు. దర్శకులు ఎంతటి మేధావులైనా .. ఎంతటి అనుభవం ఉన్నా, సినిమాల విషయంలో అరుగులపై కూర్చుని సాధారణ ప్రేక్షకులు ఇచ్చే తీర్పునే ఫైనల్. శుక్రవారం వచ్చిందంటే చాలు .. సాధారణ ప్రేక్షకుడు ఇచ్చే ఆ తీర్పు కోసమే అంతా ఎదురుచూస్తుంటారు. అలా ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన సినిమాల్లో హను రాఘవపుడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' ఒకటి. దుల్కర్ సల్మాన్ .. మృణాల్ .. రష్మిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఆయన గట్టి నమ్మకంతో ఉన్నాడు.
హను రాఘవపూడి పేరు వినగానే 'అందాల రాక్షసి' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఆ తరువాత చేసిన 'కృష్ణగాడి ప్రేమగాథ' కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో ఈ కుర్రాడిలో మంచి విషయం ఉందని అంతా అనుకుంటున్న సమయంలోనే ఆయన నుంచి 'లై' .. 'పడి పడి లేచే మనసు' వంటి ఫ్లాపులు వచ్చాయి. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకుని వచ్చాయి. ఆ సినిమాలు ఆ స్థాయి ఫ్లాపులు చూడటానికిగల కారణాలను గురించి తాజా ఇంటర్వ్యూలో హను రాఘవపూడి చెప్పుకొచ్చాడు.
'లై' సినిమాను మొదలుపెట్టినప్పుడే రిలీజ్ డేట్ ను లాక్ చేయడం మేము చేసిన మొదటి తప్పు. ఆ రిలీజ్ డేట్ ను అందుకోవడానికి మేము పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. యూఎస్ ఏలో 60 రోజుల పాటు రోజుకి 20 గంటలు కష్టపడవలసి వచ్చింది. ఇంత చేసినా రిలీజ్ కి ముందు నేను సినిమా మొత్తాన్ని ఒకసారి చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది .. అలాగే థియేటర్లకు వెళ్లిపోయింది.
ఇక ముందుగా హీరో - విలన్ మధ్య మాత్రమే నడిచే గేమ్ గా ఈ కథను నడిపించాలని అనుకున్నాము. ఆ తరువాత అవసరం లేకపోయినా హీరోయిన్ పాత్రను చేర్చడంతో అసలు కథ పక్కకి వెళ్లిపోయింది.
ఇక 'పడిపడిలేచే మనసు' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోయిన్ ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని చివరివరకూ దాచడం వలన ఆడియన్స్ సర్ ప్రైజ్ ఫీలవుతారని అనుకున్నాను. కానీ అది రివర్స్ అయింది.
ఆ విషయాన్ని నేను చివర్లో చెప్పడం అనేక విమర్శలను తెచ్చిపెట్టింది. ఈ కథను తెరపై ఆవిష్కరించడంలో నేను తడబడ్డాననీ .. అయోమయానికి లోనయ్యాననే కామెంట్స్ వినిపించాయి. ఈ పొరపాట్లు నా వల్ల జరగలేదని నేను చెప్పను. 'సీతా రామం' విషయంలో మాత్రం నా బలహీనతలను అధిగమించానని మాత్రం బలంగా చెప్పగలను" అన్నాడు.