Begin typing your search above and press return to search.
హిట్టు కొట్టాడు.. పెళ్లి పీటలెక్కేస్తున్నాడు
By: Tupaki Desk | 5 April 2016 9:44 AM GMTదర్శకుడు కావాలని సినీ పరిశ్రమలోకి వచ్చిన కుర్రాళ్లు అంత ఈజీగా పెళ్లి చేసుకోరు. డైరెక్టర్ అన్న క్రెడిట్ పడితే తప్ప పెళ్లి ఊసు ఎత్తరు. మధ్యలో పెళ్లి చేసుకుంటే బాధ్యతల్లో పడి.. తమ లక్ష్యానికి దూరమైపోతామేమో అన్న భయం ఉంటుంది చాలా మందికి. ఇలా మెగా ఫోన్ పట్టిన తర్వాతే పెళ్లి చేసుకున్న చాలామంది దర్శకుల్ని మనం చూడొచ్చు. ఈ కోవలోకే చేరబోతున్నాడు యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి.
నాలుగేళ్ల కిందటే దర్శకుడైనప్పటికీ.. తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాక పెళ్లి పీటలెక్కబోతున్నాడు హను. అతడి తొలి సినిమా ‘అందాల రాక్షసి’ విమర్శకుల ప్రశంసలందుకుంది కానీ.. కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఐతే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ అతడికి రెండు రకాలుగా మంచి ఫలితాన్నందించింది.
ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్న హను.. ఈ ఆగస్టులోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అమూల్య అనే డాక్టర్ ను అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమే. తన తల్లి చూపించిన అమ్మాయినే హను పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ నెల 16న ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆగస్టులో పెళ్లి అనుకుంటున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు చాలామంది అమెరికాలో ఉన్న నేపథ్యంలో పెళ్లి డేటు కొంచెం లేటుగా పెట్టుకున్నట్లు సమాచారం.