Begin typing your search above and press return to search.

'సీతారామం' దర్శకుడి తదుపరి సినిమా..!

By:  Tupaki Desk   |   19 Aug 2022 1:30 AM GMT
సీతారామం దర్శకుడి తదుపరి సినిమా..!
X
అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న హను రాఘవపూడి ఆ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కాని దర్శకుడిగా ఆయనకు సినిమా సినిమాకు మంచి పేరు వచ్చింది. తాజాగా సీతారామం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్ గా సీతారామం సినిమా నిలిచిన విషయం తెల్సిందే.

దుల్కర్ సల్మాన్‌.. మృనాల్‌ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమా 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్‌ సినిమాల జాబితాలో సీతారామం సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా సీతారామం సినిమా ఒక క్లాసిక్‌ లవ్‌ స్టోరీ చిత్రంగా కూడా నిలిచి పోతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో దర్శకుడు హను రాఘవపూడి తదుపరి సినిమా ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీతారామం సినిమా షూటింగ్‌ పూర్తి కాకముందే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్‌ అయ్యింది. ఒక పీరియాడ్‌ డ్రామా నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ వారు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా రూపొందబోతోంది.

హను రాఘవపూడి సినిమా అనగానే సీతారామం వంటి విభిన్నమైన ప్రేమ కథను మళ్లీ ప్రేక్షకులు ఆశిస్తారు. కనుక పీరియాడిక్ డ్రామాలో కూడా ఒక మంచి ఫీల్ గుడ్‌ లవ్ స్టోరీని దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సీతారామం సినిమా విడుదల తర్వాత ఇప్పటికే అనుకున్న కథ లో మళ్లీ మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ వారి తో కలిసి హను రాఘవపూడి చేయబోతున్న ఆ సినిమా కథ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు పలువురు హీరోలతో కూడా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి సీతారామం సినిమా సక్సెస్ నేపథ్యంలో పలువురు హీరోలు కూడా ఇప్పుడు హను రాఘవపూడి కి ఓకే చెప్పే అవకాశం ఉంది. కనుక వెంటనే హను రాఘవపూడి తదుపరి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.