Begin typing your search above and press return to search.
జై బాలయ్య అలా లీకైంది-హను రాఘవపూడి
By: Tupaki Desk | 12 Feb 2016 1:30 AM GMTఅందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఖమ్మం కుర్రాడు హను రాఘవపూడి... తన తదుపరి చిత్రం చేయడానికి నాలుగేళ్లు పట్టింది. తన తొలి సినిమానే ఓ క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కించి యూత్ హృదయాలను ఆకట్టుకున్నాడు. ఈ సారి కూడా తన జోనర్ ను వదలకోకుండా.. యాక్షన్ జోడించి మరో అందమైన లవ్ స్టోరీని రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించాడు. ఈనెల 12న హను దర్శకత్వంలో నాని, ఉత్తరాది భామ మెహరీన్ జంటగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందులో హీరో నాని బాలకృష్ణ అభిమాని కావడంతో తనకు ఎదురైన ఇబ్బందులను చాలా ఈజీగా తప్పించుకొంటాడు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలో ఈ చిత్రం అవ్ స్టోరీ జరుగుతుంది. అక్కడ బాలయ్యకు ఫ్యాన్స్ ఎక్కువ. కథలో భాగంగానే హీరో బాలయ్య అభిమానిగా చూపించాం. ఈ చిత్రం షూటింగ్ చేసే సమయంలో హీరో నాని చేతికి ‘జై బాలయ్య’ అనే టాటూ వుండటాన్ని ఎవరో సెల్ ద్వారా క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరిగింది. అలా ‘జై బాలయ్య’ అనే టైటిల్ బయటకొచ్చింది. నిజానికి మేము ఆ టైటిల్ అనుకోలేదు’ అన్నారు.
ఇంకా హను మాట్లాడుతూ ‘నానికి అందాల రాక్షసి స్టోరీ చెబితే.. నిర్మొహమాటంగా నచ్చలేదనేశాడు. దాంతో మరో రెండు స్టోరీలు వినిపించా. అయినా సాటిస్ ఫై కాలేదు. ఆ తరువాత ఏదో సందర్భంలో ఈ స్టోరీ లైన్ చెప్పా. తనకు బాగా నచ్చేసింది. ఇంకా బాగా డెవలప్ చెయ్ అన్నాడు. ప్రతి రెండు రోజులకోసారి ఈ స్టోరీ అప్ డేట్స్ చెప్పేవాణ్ని. అలా ఈ స్టోరీ తెరకెక్కింది. ఇందులో నాని కనిపించడు. కేవలం కృష్ణగాడు మాత్రమే కనిపిస్తాడు. అనంతపురం అనగానే ఫ్యాక్షన్ అనేది గుర్తొస్తుంది. ఇందులో ఫ్యాక్షన్ తాలూకు విషయాలు కనిపించకపోయినా... అది పునాదిలా కృష్ణగాడి లవ్ స్టోరీకి పనిచేస్తుంది. దాన్ని చాలా బాగా డీల్ చేశాం. తెరమీద మీరే చూస్తారు. అలాగే హీరోయిన్ మెహ్రీన్ మహాలక్ష్మీ క్యారెక్టర్ లో బాగా చేసింది. తనకు తెలుగు రాకపోయినా... తెలుసుకొని నటించింది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, మోపిడి, రాకెట్ల తదితర ప్రాంతాల్లోని చాలా సహజమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా తదుపరి చిత్రం ‘కవచం’ వుంటుంది. నటీనటులు ఎవరనేది త్వరలో చెబుతా. రానాకు ఈ కథను చెప్పా. ఇంకా ఓకే కాలేదు. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తా’ అంటూ ముగించారు.