Begin typing your search above and press return to search.
హను... అన్నీ వాడేశావా?!
By: Tupaki Desk | 13 Feb 2016 5:32 AM GMTఅందాల రాక్షసి సినిమాని చూసి ఈ దర్శకుడు ప్రేమకథల్లో ఎక్స్ పర్ట్ అని ఫిక్సయ్యారంతా. హను రాఘవపూడి ఆ సినిమాని ప్రేమతోనే మొదలుపెట్టి ప్రేమతోనే ముగించాడు మరి. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ అని టైటిల్ పెట్టేసరికి హను మళ్లీ ప్రేమకథే తీశాడేంటి అన్నారంతా. చాంతాడంత టైటిల్ చూసి `నో డౌట్ హను మళ్లీ అందాల రాక్షసి లాంటి మరో కవితాత్మకమైన సినిమానే తీసినట్టున్నాడు` అని మాట్లాడుకొన్నారు. కానీ నాని ప్రభావమో లేక నిర్మాతల ప్రమేయమో... ఆ రెండూ కాకుండా హనునే మారిపోయాడో తెలియదు కానీ ఒక మంచి కమర్షియల్ సినిమా తీశాడు.
అయితే ఈ సినిమాలో హను బోలెడన్ని కథల్ని కలిపాడు. ప్రేమ - ఫ్యాక్షనిజం - మాఫియా - అడ్వెంచర్... ఇలా అన్ని ఓ గాథలో కూర్చేశాడు. థియేటర్ నుంచి బయటికొచ్చేశాక తాము ఎలాంటి సినిమాని చూశామో అర్థం కాక ప్రేక్షకులు కాసేపు ఆలోచనల్లోకి వెళ్లిపోతారు. హను తన దగ్గర ఉన్న కథలన్నీ ఒక సినిమా కోసమే వాడేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇన్ని కథలున్నా ఎక్కడా గందరగోళానికి గురికాకుండా, ప్రేక్షకుల్ని తికమక పెట్టకుండా సినిమాని డీల్ చేశాడు హను. ఆ విషయంలో ఆయనకి వందకి వంద మార్కులేయాల్సిందే. ఈ సినిమాని చూపిస్తే హీరోలు ఎవ్వరైనా సరే తప్పకుండా అవకాశమిస్తారు కానీ... కొత్త సినిమా తీయడానికి హను దగ్గరే కథలేమైనా మిగిలాయో లేవో మరి!