Begin typing your search above and press return to search.
కుర్ర డైరెక్టరూ.. మరీ అంత సిగ్గేంటో?
By: Tupaki Desk | 21 Jan 2016 7:30 AM GMTఅందాల రాక్షసి.. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయి ఉండొచ్చు. కానీ ఆ సినిమా తీసిన హను రాఘవపూడి దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. ఆ సినిమా చూసి అతడి అభిమానులుగా మారిపోయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. మళ్లీ ఈ డైరెక్టర్ ఏం సినిమా తీస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే హను తొలి సినిమాకు పూర్తి భిన్నంగా ఓ ఎంటర్ టైనర్ ఎంచుకున్నాడీసారి. నాని కథానాయకుడిగా అతను తీసిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఇంకొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. నిన్న ఆడియో ఫంక్షన్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఇన్ స్టంట్ గా జనాలకు ఎక్కేసింది. హను టాలెంట్ మరోసారి ప్రూవ్ అయ్యేలా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే.
ఐతే ఇంత టాలెంట్ ఉన్న హను ఆడియో ఫంక్షన్ లో మైకు పట్టుకుని మాట్లాడ్డానికి తెగ ఇబ్బంది పడిపోయాడు. సినిమాలో హీరోకు కత్తి అంటే భయమని.. తనకు మైక్ అంటే భయమని ముందే చెప్పేసిన హను.. ఆ తర్వాత స్టేజ్ ఫియర్ తో షేకైపోయాడు. పదాలు కూడబలుక్కుని అతి కష్టం మీద మాట్లాడాడు. ముందు లైట్ బాయ్స్ గురించి.. వాళ్ల కష్టం గురించి చెప్పిన హను.. ఈ సినిమాలో అందరూ చాలా కష్టపడ్డారని, తనే అందరి కంటే తక్కువ కష్టపడ్డానని చెప్పాడు. నాని గురించి మాట్లాడితే నిన్నటి పేపర్ ఈ రోజు చదివినట్లు ఉంటుందని.. నిర్మాతల గురించి మాట్లాడితే తన గురించి తనే చెప్పుకున్నట్లుంటుందని.. ఇలా పొడిపొడిగా నాలుగు ముక్కలు మాట్లాడి ముగించేశాడు హను.